NTV Telugu Site icon

Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఓవైసీ బిల్డింగ్ కు ఒక్కో బుల్డోజర్ పెట్టేది..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: బీజేపీ అధికారం లోకి వచ్చి ఉంటే ఒక్కో ఓవైసీ బిల్డింగ్ కు ఒక్కో బుల్డోజర్ ను పెట్టేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ కి ఎందుకు మినహాయింపు… చెరువులో కట్టామని ఆయన ఒప్పుకున్న ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. ఓవైసీ వార్నింగ్ కు కాంగ్రెస్ భయపడుతుంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొత్త తరం రావాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు లో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తల కష్టం వల్లే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 76 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయని తెలిపారు. MIM పార్టీ పీడ విరగడ కావాలంటే పాతబస్తీలో బీజేపీ సభ్యత్వం పెరగాలన్నారు.

Read also: Jagga Reddy: సీఎం రేవంత్‌ అపాయింట్మెంట్ తీసుకోండి.. కేసీఆర్‌ కు జగ్గారెడ్డి సూచన

బీజేపీ, జన సంఘ్, జనతా పార్టీ లేకుంటే దేశాన్ని కాంగ్రెస్ 7 ముక్కలు చేసేదన్నారు. చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలని తెలిపారు. కార్యకర్తల త్యాగాల పునాదుల మీద బీజేపీ నిర్మాణం జరిగిందన్నారు. కాంగ్రెస్ ,BRS పార్టీల కోసం త్యాగం చేసిన కార్యకర్తలను ఆ పార్టీ నేతలు గుర్తించుకోరన్నారు. పార్టీ కోసం త్యాగం చేసిన ప్రతీ కార్యకర్తను బీజేపీ గుర్తుంచుకుంటుందన్నారు. త్యాగం చేసిన ప్రతి ఒక్కరినీ BRS మరిచిపోయిందన్నారు. కాంగ్రెస్ కు గుర్తుకువచ్చేది కేవలం నెహ్రూ, రాజీవ్ గాంధీ లే అని కీలక వ్యాఖ్యలు చేశారు. BRS కు గుర్తుకు వచ్చేది కెసిఅర్, కేటీఆర్, హరీష్, సంతోష్ లే అని తెలిపారు. సభ్యత్వం చేయాలని కోరే హక్కు బీజేపీ కి మాత్రమే ఉందన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ మధ్య ఎలాంటి తేడా లేదన్నారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉందన్నారు.

Read also: CM Revanth Reddy: సచివాలయంలో సీఎం రేవంత్ కు వేములవాడ అర్చకుల ఆశీర్వాదం..

కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా కంపెనీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దోళ్ల బిల్డింగ్ లు కూల కొడితే స్వాగతిస్తం, పెదోళ్ల జోలికి వస్తె ఊరుకోమన్నారు. ఓవైసీ వార్నింగ్ కు కాంగ్రెస్ భయపడుతుందని, ఓవైసీ కి ఎందుకు మినహాయింపు… చెరువులో కట్టామని ఆయన ఒప్పుకున్న ఎందుకు తొలగించడం లేదు? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారం లోకి వచ్చి ఉంటే ఒక్కో ఓవైసీ బిల్డింగ్ కు ఒక్కో బుల్డోజర్ ను పెట్టేదన్నారు. బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేసిన బీఆర్ఎస్ ను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. కార్యకర్తల మీద కేసులు పెట్టీ హింసించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. 2028 లో తెలంగాణ లో అధికారం లోకి వచ్చేది బీజేపీ నే అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ లో విలీనం అవుతుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది… అది అయ్యే పని కాదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నీ ప్రజలు చీదరించుకుంటున్నారు. ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.. అందుకు మనం సిద్ధంగా ఉన్నామా ఆలోచించుకోవాలని తెలిపారు.
Lorry Accident: లారీ ఢీకొని ఆరో తరగతి విద్యార్థి మృతి ఘటన.. వెలుగులోకి సీసీ ఫుటేజ్..