NTV Telugu Site icon

Bandi Sanjay: పొద్దున తిడతారు.. సాయంత్రం సెటిల్ చేసుకుంటారు.. కేటీఆర్‌ పై బండి సంజయ్‌ ఫైర్‌

Bandi Snajay

Bandi Snajay

Bandi Sanjay: కేటీఆర్ పొద్దున రేవంత్ రెడ్డి నీ తిడతారు సాయంత్రం సెటిల్ చేసుకుంటారని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ఆధ్యాత్మిక, సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్నా సేవా మేళా కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నీ కాపాడుతుంది నేను కాదు కేటీఆర్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ యాక్టింగ్ సీఎం అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కి భవిష్యత్ లేదన్నారు. ఎమ్మెల్సీగా గా ఆ పార్టీ నుండి పోటీ చేసేందుకు ఎవరు సిద్ధంగా లేరని సంచలన వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ నోటీసులకు రిప్లై ఇచ్చాను.. ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. కేటీఆర్ కన్నా క్రెడిబులిటి ఉన్న వ్యక్తి హరీష్ రావు అన్నారు. కేటీఆర్ కళ్ళు నెత్తికి ఎక్కాయి… మోడీ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు. అయన అహంకారం దించుతామన్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఒకటే అని క్రియేట్ చేసే ప్రయత్నం కేటీఆర్, బీఆర్ఎస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: CM Revanth Reddy: మాడవీధుల్లో గండ దీపం వద్ద దీపారాధన.. సీఎంకు పూర్ణ కుంభ స్వాగతం

రేవంత్, బండి సంజయ్ ఒక్కటేనని కేటీఆర్ చేసిన కామెంట్స్ పై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు తొంగి చూసే బుద్దిలే ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రేవంత్, నేను కొట్లాడామని గుర్తుచేశారు. అందుకే మేమిద్దరం కేటీఆర్ కలలోకి వస్తున్నామని సెటైర్ వేశారు. సమస్యను నేను డైవర్ట్ చేయడం లేదన్నారు. డైవర్షన్, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేసే అలవాటు కేటీఆర్ కే ఉందన్నారు. జన్వాడా ఫార్మ్ హౌస్ కేసులో కాంగ్రెస్ – బీఆర్ఎస్ కాంప్రమైజ్ అయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసులన్నీ హంగామా చేసి చివరకు కాంగ్రెస్ – బీఆర్ఎస్ కాంప్రమైజ్ అవుతున్నారని తెలిపారు. బీజేపీకి స్పేస్ లేకుండా చేయాలని కాంగ్రెస్ – బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయన్నారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు కాకుండా.. ఎన్నికలు వచ్చినప్పుడు బయటకు వస్తె వాళ్ళు లీడర్ అవుతారా ? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఇప్పుడు లేదు.. ఇక ముందు ఉండదన్నారు. ప్రజా నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ క్యాడర్ లేదు.. కెపాసిటీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని తెలిపారు.

Read also: KTR Tweet: సీఎం రేవంత్‌ రెడ్డికి బర్త్‌ డే విషెస్ చెప్పిన కేటీఆర్.. ఎక్స్ లో సెటైర్లు..

బీఆర్ఎస్ నేత కేసీఆర్ రెస్ట్ లో ఉన్నారు.. కేసీఆర్ కొడుకు యాక్టింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి బీఆర్ఎస్ కి అభ్యర్థులు దొరకడం లేదని సెటైర్ వేశారు. అభ్యర్థులు లేకపోవడంతో పోటీకి దూరంగా ఉంటున్నామని అంటున్నారని తెలిపారు. సర్పంచ్ ల పొట్టగొట్టిందే బీఆర్ఎస్.. సిగ్గు లేకుండా వాళ్ళ దగ్గరకు మళ్ళీ వెళ్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ కొడుకును ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ కొడుకు అహంకారం తల నుంచి కిందకు దించుతా అన్నారు. ప్రధానిపై ఇష్టరీతిగా మాట్లాడితే సహించేది లేదన్నారు. టీవీలో, ట్విట్టర్లో తప్ప కేటీఆర్ ఎక్కడ కనిపించడం లేదన్నారు. సోషల్ మీడియాలో రేవంత్, బండి సంజయ్ ఒక్కటేనని ప్రచారం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందని మండిపడ్డారు. నేను రేవంత్ ఒక్కటే అని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చెప్పండి అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వలేదు.. గవర్నర్ ఖమ్మం వెళ్తానంటే కనీసం హెలికాప్టర్ ఇవ్వలేదని గుర్తుచేశారు.
Hyderabad: పంజాగుట్టలో కారు బీభత్సం.. చెకింగ్ చేస్తుండా హోం గార్డు ఈడ్చుకెళ్ళిన డ్రైవర్‌

Show comments