G. Kishan Reddy: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం ఇవాళ జరగనుంది. ఎల్లమ్మ తల్లి కల్యాణానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దీంతో అలయ అధికారులు సాదరంగా ఆహ్వానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సోమవారం నుంచి ప్రారంభమైన వేడుకలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. సోమవారం ఉదయం గణపతి పూజతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం శాస్త్రోక్తంగా సభలు నిర్వహించారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం ఇవాళ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, ముఖా నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుముహూర్తం 11.34 నిమిషాలకు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ ఈవో కె.అంజనీదేవి తెలిపారు. లక్షలాది మంది భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రేపు (బుధవారం) ఉదయం ఎనిమిది గంటలకు మహాశాంతి చండీ హోమం, సాయంత్రం ఆరు గంటలకు ఎల్లమ్మ అమ్మవారిని రథంపై తిరువీధుల్లో ఊరేగిస్తారు. రథోత్సవ కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి.
Read also: Brinda Release Date: స్టార్ హీరోయిన్ తొలి వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?
నగరంలోని బల్కంపేట్ ఎల్లమ్మ తల్లికి నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయ కమిటీ సభ్యులు గద్వాల నేత పట్టుచీరను బహూకరించారు. సోమవారం రాష్ట్ర రాజధానిలో పట్టువస్త్రం అందజేసిన ఆలయ కమిటీ అధ్యక్షురాలు గాయత్రి సతీష్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు భువికి 10 అడుగుల దిగువన శయన రూపంలో స్వయంభువుగా దర్శనమిచ్చారు. ఈ ఆలయంలో తల్లి విగ్రహం వెనుక నుండి నిరంతరం నీటి ఊట ఉంటుంది. ఈ స్ప్రింగ్‌లు ఏ సీజన్‌లోనైనా వస్తాయి. చారిత్రిక ఆధారాల ప్రకారం దాదాపు 700 సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారు వెలిశారని చెబుతారు.
Read also: Mumbai rain: ముంబైలో భారీ వర్షాలు.. 24 గంటల పాటు రెడ్ అలర్ట్..!
బల్కంపేట ఎల్లమ్మ ఆలయ సమీపంలోని రహదారున్నీ మూసి వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఆంక్షలపై భక్తులు, ప్రయాణికులు గమనించాలన్నారు. ఈ నెల 10వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. అమీర్‌పేట, బేగంపేట నుంచి వచ్చే వాహనాలను ఎస్‌ఆర్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీదుగా సోనీ వైన్స్, ఉమేష్‌చంద్ర విగ్రహం మీదుగా పంపుతున్నారు. సనత్‌నగర్, ఫత్తేనగర్, బేగంపేట బైపాస్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను ఆరు అడుగుల రోడ్డు, బల్కంపేట్ బతుకమ్మ చౌరస్తా నుంచి ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట మీదుగా మళ్లిస్తున్నారు. ఈ నెల 9న ఎల్లమ్మ కల్యాణం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయ సమీపంలోని నాలుగు చోట్ల వాహనాల పార్కింగ్‌ను పోలీసులు ఏర్పాటు చేశారు. భక్తులు తమ వాహనాలను ఫతేనగర్ రైల్వే సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఇరువైపులా పార్క్ చేయాలని, బల్కంపేట్ ప్రకృతి క్లినిక్, ఎస్‌ఆర్‌నగర్‌లోని రోడ్లు మరియు భవనాల శాఖ, అమీర్‌పేటలోని శ్రీ గురుగోవింద్ సింగ్ ప్లే గ్రౌండ్స్‌లో ఉంచాలని సూచించారు. ఎల్లమ్మ ఆలయంలో కల్యాణోత్సవం పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని సూచించారు.
Weather Alert : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన