NTV Telugu Site icon

Medicover Hospital: డెడ్ బాడీ కావాలంటే రూ. 4లక్షలు కట్టండి.. ఠాగూర్ సీన్ రిపీట్..

Madhapur Crime

Madhapur Crime

Medicover Hospital: హైదరాబాద్ లోని హైటెక్ సిటీ మెడికోవర్ హాస్పిటల్ లో జరిగిన ఘటన ఠాగూర్ సినిమా సీన్ ను తలపించింది. మెడికోవర్ హాస్పిటల్ కు అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మృతి చెందింది. నాగప్రియకు వైద్యం కోసం కుటుంబ సభ్యులు మూడు లక్షలకు పైగా డబ్బు కట్టారు. అయితే హాస్పిటల్ యాజమాన్యం మాత్రం అంతటితో ఆగలేదు.. జూనియర్ డాక్టర్ అని కనికరం కూడా లేకుండా.. నాగప్రియ మృత దేహంతో బేరసారానికి దిగడం సంచలం సృష్టించింది. ఆమె డెబ్ బాడీ కావాలంటే ఇంకా నాలుగు లక్షలు కట్టాల్సిందే అని డిమాండ్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. ఇప్పటి వరకు మూడు లక్షలు చెల్లించామని మృతదేహాన్ని అప్పగించాలని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపినా ఆసుపత్రి యాజమాన్యం ససేమిరా అన్నారు. డబ్బు కట్టేంత వరకు మృతదేహాన్ని ఇచ్చేది లేదని కఠినంగా వ్యవహరించడంతో నాగప్రియ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చివరకు స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో మొరపెట్టుకున్నారు. దీంతో అరికెపూడి గాంధీ కాల్ చేసిన ఆసుపత్రి యాజమాన్యంలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం.

Read also: Donald Trump: 20 రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజ.. 113 ఎలక్టోరల్‌ సీట్లు సాధించిన కమలా హరీస్

మృతురాలు నాగప్రియ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. మూడు లక్షల కడితేనే వైద్యం చేస్తానని, లేదంటే వైద్యం ఆపేస్తాను అంటూ ఆసుపత్రి యాజమాన్యం ఫోన్ చేసిందని తెలిపారు. దీంతో ఇవాళ ఉదయాన్నే వచ్చి లక్ష రూపాయలు కట్టిన తర్వాత పేషెంట్ మృతి చెందిందని డాక్టర్స్ చెప్పారని కన్నీరుమున్నీరుగా విలపించారు. డబ్బుల కోసం నాగప్రియకు వైద్యం ఆపేయడం వలనే చనిపోయింది అని బంధువులు ఆరోపిస్తున్నారు. డబ్బులు కట్టేంత వరకు నాగప్రియ మృతి వార్త చెప్పలేదని ఆందోళన చేపట్టారు. దీంతో మెడికల్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటి వరకు మూడు లక్షలు కట్టించుకుని డబ్బులు కట్టాక చనిపోయిన వార్త చెప్పారని వాపోయారు. నాగప్రియ నిన్న రాత్రే చనిపోయిందని, అయినా ఆ వార్త చెప్పకుండా ఇవాళ ఉదయం చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికవర్ హాస్పిటల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించమని భీష్మించుకుని కూర్చున్నారు. ఇంత జరుగుతున్న ఆసుపత్రి యాజమాన్యంలో ఎలాంటి మార్పు లేకపోవడం పై మృతురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన యాజమాన్యం పట్టించేకోని దాఖలాలు లేదని వాపోతున్నారు. మరి దీనిపై అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
Metro Google Wallet: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి గూగుల్ వ్యాలెట్..