Ashwaraopet SI: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అశ్వారావుపేటకు చెందిన ఎస్‌ఎస్ శ్రీరాముల శ్రీను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విషాదంగా మారింది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సీఐ జితేందర్‌రెడ్డితోపాటు నలుగురు కానిస్టేబుళ్లు పనిలో సహకరించలేదని, కులం పేరుతో వేధించారని ఆత్మహత్యాయత్నం అనంతరం ఎస్సై శ్రీను ఓ వీడియోలో తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Night Club: నైట్ పార్టీలో డ్రగ్స్ కలకలం.. అదుపులో విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను జూన్ 30న మహబూబాబాద్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారం రోజులుగా హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎస్సై శ్రీను మణుగూరు పోలీస్ స్టేషన్ నుంచి అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట. 2014లో ఎస్సైగా ఎంపికయ్యారు. అశ్వారావుపేట సీఐ జితేందర్ రెడ్డి, కానిస్టేబుళ్లు శేఖర్, శివ నాగరాజు, సన్యాసినాయుడు, సుభాని పనికి సహకరించలేదని ఎస్సై శ్రీను వీడియోలో తెలిపారు. తనను తీవ్రంగా వేధించినట్లు కూడా ఆ వీడియోలో పేర్కొన్నారు. తనను కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. తోటి సిబ్బందిపై వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. మరోవైపు నాలుగు నెలల్లోనే నాలుగు మెమోలు ఇచ్చారని సీఐ జితేందర్ రెడ్డి తెలిపారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, బదిలీల ప్రయత్నాలు ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్