Lift Accident: 15 రోజుల వ్యవధిలో మరో పసిప్రాణాన్ని లిఫ్ట్ బలిగొంది. నాంపల్లిలో లిఫ్ట్‌లో ఇరుక్కుని నరకం అనుభవించి చిన్నారి చనిపోయిన ఘటన మర్చిపోక ముందే.. అలాంటి సంఘటనే మరొకటి మెహదీపట్నంలో జరిగింది. ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్ లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
Read Also: CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. జైశంకర్ తో భేటీ అయ్యే అవకాశం..
అయితే, బుధవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన శ్యామ్ బహదూర్ వ్యక్తి.. ఉపాధి కోసం ఏడు నెలల క్రితం హైదరాబాద్ కి వచ్చాడు.. తొలుత గుడి మల్కాపూర్‌లో ఓ భవనానికి వాచ్ మెన్ గా పని చేశాడు. అయితే, మూడు నెలల కిందట సంతోష్ నగర్ కాలనీలోని ముజ్తాబా అపార్ట్‌మెంట్‌కి వాచ్‌మెన్‌గా పనిలో చేరాడు. నిర్వాహకులు రూమ్ ఇస్తామని చెప్పడంతో నేపాల్ నుంచి భార్య, కుమార్తె, కుమారుడిని నగరానికి తీసుకొచ్చాడు. ఇక, ఆరు అంతస్తులున్న భవనంలో హాస్టల్ నిర్వహిస్తున్నారు. అయితే, లిఫ్ట్ పక్కనే ఉన్న చి న్నగదిలో శ్యామ్ బహదూర్ ఫ్యామిలీ ఉంటోంది. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో సురేందర్ ఆడుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వెళ్లాడు.. ఆ సమయంలో తలుపుల మధ్యకు వెళ్లగా.. పైన ఎవరో లిఫ్ట్ నొక్కడంతో.. తలుపులు క్లోజ్ కాకుండానే లిప్ట్ పైకి దూసుకెళ్లింది. దీంతో లిఫ్ట్‌లోనే ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Read Also: Astrology: మార్చి 13, గురువారం దినఫలాలు
ఇక, కాసేపటికే సురేందర్ ఎక్కడా కనిపించకపోవడంతో వాచ్ మెన్ శ్యామ్ వెతకగా.. లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుని రక్తపుమడుగులో అపస్మారకస్థితిలో కనిపించడంతో.. తల్లిదండ్రులు రోదిస్తుండగా.. అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. వారు లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడిని హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మరణించాడని డాక్టర్లు వెల్లడించారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడన్న విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీటి మున్నీరుగా విలపించారు.