NTV Telugu Site icon

Alai Balai Program: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో అలయ్‌ బలయ్‌ కార్యక్రమం..

Alibali

Alibali

Alai Balai Program: దసరా పండుగ సందర్భంగా బండారు దత్తాత్రేయ, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రతి సంవత్సరం అలయ్ బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాగా.. హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాలకు అతీతంగా నాయకులను ఒకే వేదిక మీదకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో 2005లో అలయ్​ బలయ్​ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుల మతాలకు, పార్టీల అతీతంగా అనేక మంది ప్రముఖులు, అధికారులను ఆహ్వానించి అందరినీ ఒకే వేదికపైకి తీసుకుని వచ్చి అలయ్ బలయ్‌ కార్యక్రమం జరుపుకుంటారు. ఇవాళ ఉదయం 11గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

Read also: Lucky Bhaskar : ఏం స్ట్రాటజీ బాసూ.. ‘లక్కీ భాస్కర్’ పాన్ ఇండియా కోసం మాస్టర్ ప్లాన్

ఈ కార్యక్రమానికి అలయ్ బలయ్ కమిటీ చైర్ పర్సన్ బండారు విజయలక్ష్మి తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్​ గా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. ఈ కార్యక్రమం వివిధ రాజకీయ పార్టీలను కలిపే వేదిక.. గత 18 ఏండ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది 19వ ఏడాదని తెలిపారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా అలయ్ బలయ్ కార్యక్రమం చేపట్టనున్నారు. అంతే కాకుండా.. తెలంగాణ సంస్కృతిపై ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో స్టాల్స్ ఏర్పాటు చేశారు. మిల్లెట్స్ వంటకాలు ఉండనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మధ్నాహ్నం అలయ్‌ బలయ్‌ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఖరారు పై ఇంకా క్లారిటీ రాలేదు. వారితో పాటే తెలంగాణ, ఏపీకి చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులను సైతం ఆహ్వానించినట్టు బండారు దత్తా్త్రేయ తెలిపారు. అంతేకాకుండా.. ఈ కార్యక్రమానికి ఈసారి సినీ ప్రముఖులను పిలవలేదని విజయలక్ష్మి వెల్లడించారు.
Baba Siddique : ముంబైలో ఎన్సీపీ నాయకుడు మాబా సిద్ధిఖీ దారుణ హత్య.. ఇద్దరు నిందితుల అరెస్ట్