NTV Telugu Site icon

AI Global Summit 2024: ఏఐ గ్లోబల్ సమ్మిట్‌.. హాజరైన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు..

Ai Global Summit 2024

Ai Global Summit 2024

AI Global Summit 2024: అంతర్జాతీయ AI గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నేడు, రేపు సదస్సు జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సదస్సును ప్రారంభించారు. ప్రపంచం నలుమూలల నుండి 2,000 మంది వ్యక్తులు, కృత్రిమ మేధస్సు రంగంలో ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ తరహా ఏఐ సదస్సు దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో జరుగుతోంది.

Read also: Devara Daavudi Song: బాధను భరిస్తూ అలా చేయడం గ్రేట్.. తారక్ పై రత్నవేలు ట్వీట్ వైరల్‌

సమాజంపై AI ప్రభావాన్ని నియంత్రించడం, సవాళ్లను సదస్సులో చర్చించనున్నారు. ఈ సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఐటీ రంగంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న నాలుగో నగరంలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇవాళ, రేపు రెండు రోజులపాటు AI గ్లోబల్ సమ్మిట్ కొనసాగనుంది. “Making AI work for every one” అనే థీమ్ తో సదస్సు నిర్వహణ చేపట్టారు.
Kolkata Doctor Murder Case: పోలీసులు లంచం ఇస్తామన్నారు.. జూనియర్ డాక్టర్ ఫ్యామిలీ సంచలన ఆరోపణలు