NTV Telugu Site icon

Dilsukh Nagar Bomb Blasts: దిల్ సుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మృతి..

Dilshuk Nagar Boob Boolst

Dilshuk Nagar Boob Boolst

Dilsukh Nagar Bomb Blasts: దిల్ సుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు మృతి చెందారు. ఇండియన్ ముజాయుద్దీన్ ఉగ్రవాదుల సంస్థకు చెందిన సయ్యద్ మక్బూల్ వయస్సు 52 సంవత్సరాలు. చల్లపల్లి జైల్లో ఉన్న సయ్యద్ మక్బూల్ అనారోగ్యంతో బాధపడుతు ఉండటంతో అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. య్యద్ మక్బూల్ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పలు బాంబుదాడుల్లో సయ్యద్ మక్బూల్ ఉన్నట్లు ఎన్.ఐ.ఏ గుర్తించింది. దిల్ సుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసుల్లో ఢిల్లీ కోర్టులు సయ్యద్ మక్బూల్ ను జీవిత ఖైదు విధించింది. అనారోగ్యంతో బాధపడుతున్న సయ్యద్ ను పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ పై ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు తీసుకు వచ్చారు. కాగా సయ్యద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. గాంధీ మార్చురీలో సయ్యద్ మక్బూల్ కు పోస్టుమార్టం పూర్తి చేశారు. సయ్యద్ మక్బూల్ మృతదేమాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read also: Robbery in Shirdi Train: షిరిడి-సికింద్రాబాద్ ట్రైన్ లో దోపిడీ.. ప్రయాణికులు ఆందోళన..

ఫిబ్రవరి 21, 2013 సాయంత్రం 6:45 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 17 మంది చనిపోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడింది. పేలుళ్లకు పాల్పడిన ఐదుగురికి ఎన్‌ఐఏ కోర్టు మరణశిక్ష విధించింది. ఇప్పటి వరకు నిందితులకు ఉరిశిక్షను అమలు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పేలుళ్లలో మరణించిన వారికి మృతుల కుటుంబీకులు నివాళులర్పించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.
Raayan Twitter Review: ‘రాయన్’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్‌ ఇరగదీశాడు! సెకండ్ హీరో రెహ్మాన్