NTV Telugu Site icon

ABVP: డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర ఏబీవీపీ ఆందోళన..

Abvp

Abvp

డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర ఏబీవీపీ ఆందోళన చేపట్టారు. సంవత్సరాల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సమస్యల పైన నిత్యం విద్యార్థి పరిషత్ నుండి అధికారులకు వినతి పత్రాలు అందజేసినప్పటికీ పట్టించుకోవడంలేదనీ నిరసన వ్యక్తం చేశారు.

IND vs SA: ఫైనల్కు వర్షం ముప్పు.. రిజర్వ్ డే ఉందా?

ఏబీవీపీ డిమాండ్స్
1. ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల్లో అక్రమంగా లక్షలకు, లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి.
2. ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలి.
3. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ ,కార్పొరేట్ పాఠశాలల్లో బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతున్న యాజమాన్యాలపైన కఠిన చర్యలు తీసుకోవాలి.
4. ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి.
5. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి. వెంటనే DEO, MEO అధికారులను నియమించాలి.
6. ప్రభుత్వ పాఠశాలల్లో అందజేస్తున్న మధ్యాహ్నభోజనం లో జరుగుతున్న అవకతవకలపైన విచారణ జరిపి, నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి.
7. మెగా డీఎస్సీ ద్వారా 24 వేలకు పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేయాలి.
8. ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్, స్క్యావెంజర్లను నియమించాలి.
9. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి.

Show comments