NTV Telugu Site icon

Hyderabad Crime: పోలీసులను చూసి పరుగులు పెట్టాడు.. ప్రాణాలు వదిలాడు..

Ganja Hyderabad

Ganja Hyderabad

Hyderabad Crime: గంజాయికి బానిసైన ఓ యువకుడు పోలీసులను గమనించి పరుగులు తీశాడు. పారిపోతున్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు వెంటపడ్డారు. నాలుగో అంతస్తుపైకి వెళ్లి.. డ్రైనేజీ పైపులు పట్టుకుని దిగేందుకు ప్రయత్నిస్తూ పట్టు జారి కిందపడ్డాడు. తీవ్ర గాయాలకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెం దాడు. ఈ ఘటన సైదాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీ వాంబే క్వార్టర్స్లో నివసించే మున్నామియా కుమారుడు కలీమ్ పాష ఆటోడ్రైవర్. గంజాయికి బానిస య్యాడు. మలకపేట ఎక్సైజ్ పోలీసులు ఈ నెల 3న మత్తుపదార్థాలు, మాదక ద్రవ్యాల అనర్థాలపై స్థానికంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Read also: Meerpet Boy Missing Case: ఏంట్రా బుడ్డోడా అలా వెళ్లిపోయావ్‌.. పరుగులు పెట్టించావ్‌ కదరా..

అక్కడే ఆటోలో మిత్రులతో కలిసి సిగరెట్ తాగుతున్న పాషను స్థానికులు పసిగట్టి గంజాయి తాగు తున్నాడని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆటో వద్దకు చేరుకోగా భయంతో పరుగులు తీశాడు. వాంబే క్వార్టర్స్ నాలుగో అంతస్తు పైకి వెళ్లాడు. అతని వెంట పోలీసులు సైతం పరుగులు తీశారు. తప్పించు కునేందుకు పైపులు పట్టుకుని కిందికి దిగుతూ పట్టుతప్పి పడి పోయాడు. తీవ్రగాయాలు కావడంతో ఉస్మా నియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం మరణిం చాడు. కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐఎస్స దన్-చంపాపేట మార్గంలో రాస్తారోకో చేప ట్టారు. పోలీసుల వైఫల్యం వల్లనే గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని ఆరోపించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంత రాయం ఏర్పడింది. సైదాబాద్ ఇన్స్పెక్టర్ కె. రాఘవేందర్, ఎక్సైజ్ పోలీసులు వచ్చి కుటుంబసభ్యులతో మాట్లాడటంతో ఆందోళన విరమించారు.
Nagarjuna Sagar: టీజీ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఎంజీబీఎస్ నుంచి నేరుగా డీలక్స్ బస్సులు..