Site icon NTV Telugu

Bandi Sanjay: కుంభమేళాలో తొక్కిసలాట జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: ప్రయాగరాజ్ కుంభమేళాలో తొక్కిసలాట జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నాయి.. యోగి సర్కార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అంచనాలకు మించి కోట్లాదిగా భక్తులు ఒకే రోజు తరలిరావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తొంది.. ఇంకా నెల రోజులకు పైగా కుంభమేళాకు వెళ్లే అవకాశముంది అని బండి సంజయ్ వెల్లడించారు.

Read Also: KVN Productions : భారీ రిస్క్ చేస్తున్న కెవిఎన్ ప్రొడక్షన్.. గట్టెక్కేనా..?

ఇక, తొందరపడకుండా భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ తెలిపారు. కుంభమేళాకు వెళ్లే భక్తులు, వారి బంధువులు పుకార్లను నమ్మకూడదని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈరోజు మాఘ అమావాస్య కావడంతో పుణ్యస్నానాలు చేసేందుకు భారీగా భక్తులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది.

Exit mobile version