NTV Telugu Site icon

Night Club: నైట్ పార్టీలో డ్రగ్స్ కలకలం.. అదుపులో విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు..

Night Club

Night Club

Night Club: ఖాజాగూడలో ది కేవ్ క్లబ్ లో నైట్ పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. నైట్ పార్టీపై నార్కోటిక్ బ్యూరో పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. గంజాయి సేవించిన 24 మంది తో పాటు డీజే ఆపరేటర్ ను పట్టుకున్నారు. ఖాజాగూడలో ది కేవ్ క్లబ్ నిర్విహిస్తున్నారు. అయితే ది కేవ్ క్లబ్ నైట్ పార్టీలో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని విశ్వనీయం సమాచారం పోలీసులకు అందింది. దీంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ పోలిసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో అక్కడ వున్నవారు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వారందరిని బయటకు వెళ్లకుండా పోలీసులు పట్టుకున్నారు. పార్టీలో 55 మందికి యువతి, యువకులకు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 55 మందికి డ్రగ్స్ అనాలసిస్ పరీక్షలు నిర్వహించారు. 27 మంది గంజాయి సేవించినట్లు పాజిటివ్‌ రిపోర్ట్ రావడంతో వారందరిని అదుపులో తీసుకున్నారు.

Read also: AP Home Minister: 9వ తరగతి బాలికను హత్య చేసిన సైకో.. మృతురాలి ఇంటికి ఏపీ హోం మినిస్టర్

ఓ డీజే అపరేటర్లును కూడా అదుపులో తీసుకున్నారు. డీజే అపరేటర్ కూడా పరీక్షలు నిర్వహించగా గంజాయి, కొకైన్ సేవించినట్లు నిర్థారించారు. డీజే ఆపరేటర్ అయూబ్ గా గుర్తించారు. ఇతరు బెంగళూరు చెందిన వాడిగా గుర్తించారు. డ్రగ్స్ పార్టీలో యువతి, యువకులు గంజాయి, మెదాలిన్ డ్రగ్స్ సేవించి పార్టీలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ పేరుతో ఖాజాగూడలో ది కేవ్ క్లబ్ డ్రగ్స్ పార్టీ నడుపుతున్నాట్లు కేసు నమోదు చేశారు. పోలీసులకు పట్టుబడిన వారితో చాలా మంది విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. వీరందరూ హైదరాబాద్, బెంగళూరులో పనిచేస్తున్న సాప్ట్ వేర్ ఇంజనీర్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ లకు డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు ? డ్రగ్స్ ది కెవ్ పబ్ లో సేవించారా ? లేక ఎక్కడ డ్రగ్స్ సేవించారు ? వివరాలు సేకరించి వారి స్టేట్ మెంట్ రికార్డు చేయనున్న పోలీసులు.
Viral Video: బాబోయ్ ఎర్ర చీమలతో చట్నీనా.. ఎలా చేస్తారో చూసేయండి..

Show comments