Site icon NTV Telugu

TGSRTC MD Sajjanar: సిటీ బస్సులో మహిళకు ప్రసవం చేసిన లేడీ కండక్టర్.. సజ్జనార్ ట్వీట్..

Telangana Ledy Condector

Telangana Ledy Condector

TGSRTC MD Sajjanar: హైదరాబాద్ లో ఆర్టీసీ బస్ లేడీ కండక్టర్ మాతృత్వాన్ని చాటుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు ముషీరాబాద్ డిపో కండక్టర్ సరోజ ప్రసవం చేసిన ఘటన హైదరాబాద్ ఆర్టీసీ బస్సులో చోటుచేసుకుంది. దీనిపై ఆర్టీసీఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

Read also: Chhattisgarh : బావిలో పడిన వ్యక్తిని రక్షించే క్రమంలో గ్యాస్ లీక్ కారణంగా నలుగురు మృతి

ఆరంఘర్ నుంచి సర్వీస్ నంబర్ 81/1 రూట్ నంబర్ 1Z బస్ లో సికింద్రాబాద్ వస్తుండగా ఒక్కసారిగా ఒక మహిళ ప్రయాణికురాలకి పురిటి నొప్పులు రావడం ప్రారంభమయ్యాయి. అయితే అందులో ప్రయాణికులు కండెక్టర్‌ కు తెలుపగా.. లేడీ కండెక్టర్‌, డ్రైవర్ ను బస్సును పక్కకు ఆపాలని సూచించారు. వెంటనే డ్రైవర్ బస్సులు పక్కకు ఆపు పాసింజర్స్ కిందకు దింపేశారు. తోటి ప్రయాణికుల సహాయంతో బస్ కండక్టర్ సరోజ డెలివరీ చేశారు. ఇవాళ ఉదయం 7 గంటల 30 నిమిషాలకు పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది ఆ మహిళ. వెంటనే అదే బస్సులో తల్లి బిడ్డలను క్షేమంగా గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద అడ్మిట్ చేశారు.

సంఘటన చూసిన తోటి ప్రయాణికులు డ్రైవర్, కండక్టర్ ని అభినందించారు. అయితే.. బస్సులోనే కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్ సరోజతో పాటు సహా మహిళా ప్రయాణికులను ఐపీఎస్, TGSRTC ఎండీ వీసీ సజ్జనర్ అభినందనలు తెలియజేశారు. అప్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవా స్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం ప్రశంసనీయమని అన్నారు.

Mallu Bhatti Vikramarka: ఆరోగ్య సంరక్షణకు ‘ఫార్మా’ పరిశ్రమ వెన్నుముక లాంటిది..

Exit mobile version