Site icon NTV Telugu

Gold Smuggling: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

Gold

Gold

Gold Smuggling: హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. మస్కట్ నుంచి వచ్చిన విమాన సిబ్బంది వద్ద బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మస్కట్ నుంచి బంగారం తెచ్చి గ్రౌండ్ స్టాప్ కు ప్యాసింజర్లు అందించారు. ఎయిర్ పోర్ట్ నుంచి బంగారాన్ని బయటికి తీసుకొచ్చేందుకు గ్రౌండ్ స్టాప్ ప్రయత్నించగా.. 3.5 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. బంగారం స్మగ్లర్ కి సహకరించిన గ్రౌండ్ స్టాప్ ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి పార్కింగ్ వరకు బంగారం తీసుకొచ్చి అప్పగిస్తుండగా పట్టుకుని.. 3.5 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 3 కోట్ల 45 లక్షల రూపాయలు ఉంటుందని అంచానా వేశారు.

Exit mobile version