NTV Telugu Site icon

Hyderabad Hijab Row: హైదరాబాద్ స్కూల్‌లో హిజాబ్ వివాదం.. విద్యార్థినిని ఇంటికి పంపిన యాజమాన్యం

Hyderabad Hijab Issue

Hyderabad Hijab Issue

Hyderabad Zee High School Management Sent Back Home Student For Wearing Hijab: మనది సెక్యులర్ దేశం. ఇక్కడ అన్ని మతాలవారికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. కానీ, కొందరిలో మాత్రం ఆ సెక్యులర్ భావనలు లేవు. ఇతర మతస్తులపై విషం చిమ్ముతూ.. ప్రశాంతంగా ఉన్న సమాజంలో దుమారం రేపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొందుతూ.. ఈ వ్యవహారం ఇప్పుడు పాఠశాలల దాకా కూడా చేరింది. కర్ణాటకలో హిజాబ్ గొడవ ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌లో కూడా ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంది. ఓ అమ్మాయి హిజాబ్ ధరించి స్కూల్‌కి వచ్చిందని, ఆమెను వెంటనే బయటకు పంపించేశారు. దీంతో.. ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Uttar Pradesh : పెళ్లింట్లో విషాదం..నిద్రపోతున్న ఐదుగురిని నరికి.. గన్​తో కాల్చుకుని సూసైడ్

హయత్ నగర్‌లో జీ హై స్కూల్ ఉంది. ఇందులో సామియా ఫాతిమా అనే యువతి 10వ తరగతి చదువుతోంది. శనివారం ఈ అమ్మాయి హిజాబ్ ధరించి స్కూలుకి వెళ్లగా.. స్కూల్ యాజమాన్యం ఆమెని ఇంటికి పంపింది. ఇంటికి చేరుకున్న ఆ విద్యార్థిని జరిగిన విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలియజేయగా.. వాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. కస్తూరి A1(క్లాస్ టీచర్), పూర్ణిమ A2 (ప్రిన్సిపాల్), మధు శ్రీ A3 (9th class కో ఆర్డినేటర్), కవిత A4 (10th క్లాస్ కో ఆర్డినేటర్)లపై కేసు నమోదైంది. అయితే.. ఈ ఘటనపై స్పందించేందుకు స్కూల్ యాజమాన్యం నిరాకరించింది. ఒక స్కూల్‌లో హిజాబ్ అంశాన్ని ఎందుకు లేవనెత్తారని ప్రశ్నిస్తే.. ఎవ్వరూ సమాధానం చెప్పడానికి ముందుకు రాలేదు.

Ramya Pasupuleti: బీచ్ ఒడ్డున సాగర కన్యలా రమ్య పసుపులేటి అందాలు

మరోవైపు.. ఈ ఘటనపై విద్యార్థిని సామియా ఫాతిమా తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. హిజాబ్ వేసుకుంటే బయటకు పంపడమనేది మానవ హక్కులను హరించడమేనని పేర్కొంది. సెక్యులరిజం అంటే.. అన్నీ మతాలకు స్వేచ్ఛను ఇవ్వడమని తెలిపింది. కానీ.. స్కూల్ యాజమాన్యం తనపట్ల ఇలా వ్యవహరించడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో కూడా ఒక జూనియర్ అమ్మాయి హిజాబ్‌ను బలవంతంగా లాగేశారని తెలిపింది. ఇప్పుడు తన పట్ల కూడా అలాగే చేయడంతో, తాను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని స్పష్టం చేసింది. ప్రతీ అమ్మాయి ఇలాంటి అంశాలపై ధైర్యంగా మాట్లాడాలని సూచించింది.