Smuggling : హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల యువతి అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తూ పట్టుబడింది. సోమవారం రాత్రి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానం (ఫ్లైట్ నంబర్ 6E-1068) ద్వారా హైదరాబాద్‌కు చేరుకున్న ఆమె ప్రవర్తనపై భద్రతా సిబ్బందికి అనుమానం కలగడంతో తనిఖీలు చేపట్టారు.
తనిఖీలలో ఆమె లగేజ్‌లో 3.1 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి బయటపడింది. ఈ గంజాయిని ప్రత్యేకంగా నాలుగు ప్యాకెట్లలో కట్టి దాచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డ్రగ్స్ విలువ దాదాపు రూ. 3 కోట్లు ఉంటుందని అంచనా. హైడ్రోపోనిక్ గంజాయి సాధారణంగా అధిక డిమాండ్ కలిగిన డ్రగ్‌గా గుర్తించబడుతుందని, ఇది అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్లలో భాగంగా తరచూ రవాణా చేయబడుతుందని అధికారుల అభిప్రాయం.
Mirai Movie: జాతీయ స్థాయిలో తెలుగు సినిమా వెళ్ళడానికి కారణం.. ఆ నలుగురే
ప్రారంభంలో ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతోనే అధికారులు మరింత జాగ్రత్తగా తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లోనే గంజాయి ప్యాకెట్లు బయటపడడంతో వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది మరియు కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా నిర్వహించినట్లు సమాచారం.
ప్రస్తుతం నిందితురాలు కస్టడీలో ఉండగా, ఆమెను మరింత విచారిస్తున్నారు. గతంలో కూడా ఇదే తరహా డ్రగ్ రవాణా ప్రయత్నాల్లో పాల్గొన్నదా? లేదా ఈ సంఘటన వెనుక అంతర్జాతీయ డ్రగ్ మాఫియా నెట్‌వర్క్ ఉందా? అన్న కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్ మాఫియాతో సంబంధాలపై స్పష్టత రావడానికి ఆమె మొబైల్ ఫోన్ డేటా, ట్రావెల్ హిస్టరీని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా హైదరాబాద్‌లో డ్రగ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే పలు కాలేజీలకు చెందిన విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నట్లు బయటపడగా, ఈసారి ఒక యువతి అంతర్జాతీయంగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
PM Modi: ట్యాక్స్‌లతో చిన్న పిల్లలను వదలని కాంగ్రెస్.. జీఎస్టీ సవరణలపై మోడీ
