Hyderabad: నంబర్‌ప్లేట్ టాంపరింగ్‌పై ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక.. అలా చేస్తే జైలుకే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Traffic Police Warning: హైదరాబాద్ నగరంలో చలాన్లు పడకుండా కొందరు వాహనదారులు నెంబర్ ప్లేట్ కనబడకుండా చేస్తున్నారు. నెంబర్ ప్లేట్ తీసేయడం, మాస్కు కట్టడం, ప్రింట్ తుడిచేయడం లాంటివి చేస్తున్నారు. కొందరు నేరస్తులు నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనాల నంబర్ ప్లేట్ టాంపరింగ్‌పై ట్రాఫిక్ పోలీసులు ఫోకస్ పెట్టారు. వాహనాల నంబర్ ప్లేట్‌లు టాంపిరింగ్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా వాహనానికి నంబర్ ప్లేట్ కనిపించకుండా చేస్తే జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. అలాంటి వారిపై ఛార్జీషీట్ వేసి వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. నంబర్‌ప్లేట్‌కు మాస్క్ కట్టినా నేరంగానే పరిగణిస్తామన్నారు.
కాగా వాహనం నంబర్ ప్లేట్ సక్రమంగా ఉన్న వారు నిబంధనలు పాటిస్తారు, నంబర్‌ప్లేట్ సరిగ్గా లేని వారు తమనెవరూ పట్టుకోరనే ధీమాతో ఇష్టానుసారంగా వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారకులు అవుతున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మూడు రోజుల క్రితం నగరంలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో 100కుపైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. దీంతో వాహనం ఎవరి పేరుపై ఉంటుందో వారే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. అటు షోరూం నుంచి వాహనం కొనుగోలు చేసిన నెలరోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read
- Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
- తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
- Balkampet Yellamma: నేడు "బల్కంపేట ఎల్లమ్మ తల్లి" వార్షిక కళ్యాణ మహోత్సవం..!
- Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
తాజావార్తలు
-
KVN : విజయ్ లెగసీకి అదిరిపోయే ట్రిబ్యూట్.. ‘జన నాయకుడు’
-
CJP Protest: ‘మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి రోజు’.. ప్రాణత్యాగాలకు సిద్ధంకండి.. సీక్రెట్ యాప్‌పై దర్యాప్తు
-
Murali Kishor: ‘లెనిన్’ డైరెక్టర్‌కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
-
Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!