Bribe : హైదరాబాద్ నగర పోలీస్ విభాగాన్ని కుదిపేసే ఘటన బయటపడింది. రూ.3 వేల కోట్ల భారీ ఆర్థిక మోసం చేసి ముంబైకి పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందంలోని ఎస్ఐ అక్రమ డీల్‌లో పాల్గొన్నట్టు తేలింది. వివరాల్లోకి వెళ్తే.. మోసం కేసులో కీలక నిందితుడు ముంబైలో దొరికిపోవడంతో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అతని అరెస్టుకు ఆదేశించారు. ఆ బృందంలో ఉన్న ఒక ఎస్ఐ నిందితుడిని ముంబైలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
Pulluri Prasad Rao : మావోయిస్టులకు మరో దెబ్బ.. డీజీపీ ముందు లొంగిపోనున్న కీలక నేతలు
నిందితుడితో రూ.2 కోట్లకు డీల్ కుదుర్చుకున్న ఆ ఎస్ఐ, ఇతర పోలీసులను వేరే వాహనంలో పంపించి, తాను మాత్రం నిందితుడితో వేరే వాహనంలో రావడానికి ప్రణాళిక రూపొందించాడు. రెండు వాహనాల మధ్య 30 కిలోమీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మార్గ మధ్యలో నిందితుడి అనుచరులకు ఫోన్ చేసి, ఒక హోటల్ వద్ద రూ.2 కోట్లు క్యాష్ తీసుకురావాలని ఆదేశించాడు.
అక్కడే డబ్బులు తీసుకుని నిందితుడిని వదిలేసిన ఎస్ఐ, తాను వాహనం ఆపినప్పుడు నిందితుడు పారిపోయాడని ఉన్నతాధికారులను నమ్మించేందుకు ప్రయత్నించాడు. కానీ, విచారణలో నిజం బయటపడింది. డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీలో ఎస్ఐ డబ్బులు తీసుకుని నిందితుడిని వదిలేసినట్టు తేలింది. 2020 బ్యాచ్‌కు చెందిన సదరు ఎస్ఐ గతంలో కూడా అనేక అక్రమాలకు పాల్పడినట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి.
Abhishek Sharma: స్కెచ్ వేశాం.. అభిషేక్ శర్మను మొదటి బంతికే బుట్టలో వేస్తాం!
