Bribe : ఎస్ఐ కక్కుర్తి.. 2 కోట్ల కోసం 3 వేల కోట్ల ఆర్థిక నిందితుడిని తప్పించేశాడుగా..!
- ఓ ఆర్థిక నేరస్తుడితో ఎస్సై రూ.2కోట్ల డీల్
- రూ.2కోట్లు తీసుకుని పోలీస్ కస్టడీ నుంచి ఆర్థిక నేరస్తుడ్ని వదిలేసిన ఎస్సై
- రూ.3 వేల కోట్లు కొల్లగొట్టి ముంబైకి పారిపోయిన ఓ ఆర్థిక నేరస్తుడు
- నిందితుడి కోసం ముంబైకి వెళ్లిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీస్ టీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bribe : హైదరాబాద్ నగర పోలీస్ విభాగాన్ని కుదిపేసే ఘటన బయటపడింది. రూ.3 వేల కోట్ల భారీ ఆర్థిక మోసం చేసి ముంబైకి పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందంలోని ఎస్ఐ అక్రమ డీల్‌లో పాల్గొన్నట్టు తేలింది. వివరాల్లోకి వెళ్తే.. మోసం కేసులో కీలక నిందితుడు ముంబైలో దొరికిపోవడంతో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అతని అరెస్టుకు ఆదేశించారు. ఆ బృందంలో ఉన్న ఒక ఎస్ఐ నిందితుడిని ముంబైలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
Pulluri Prasad Rao : మావోయిస్టులకు మరో దెబ్బ.. డీజీపీ ముందు లొంగిపోనున్న కీలక నేతలు
Also Read
నిందితుడితో రూ.2 కోట్లకు డీల్ కుదుర్చుకున్న ఆ ఎస్ఐ, ఇతర పోలీసులను వేరే వాహనంలో పంపించి, తాను మాత్రం నిందితుడితో వేరే వాహనంలో రావడానికి ప్రణాళిక రూపొందించాడు. రెండు వాహనాల మధ్య 30 కిలోమీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మార్గ మధ్యలో నిందితుడి అనుచరులకు ఫోన్ చేసి, ఒక హోటల్ వద్ద రూ.2 కోట్లు క్యాష్ తీసుకురావాలని ఆదేశించాడు.
అక్కడే డబ్బులు తీసుకుని నిందితుడిని వదిలేసిన ఎస్ఐ, తాను వాహనం ఆపినప్పుడు నిందితుడు పారిపోయాడని ఉన్నతాధికారులను నమ్మించేందుకు ప్రయత్నించాడు. కానీ, విచారణలో నిజం బయటపడింది. డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీలో ఎస్ఐ డబ్బులు తీసుకుని నిందితుడిని వదిలేసినట్టు తేలింది. 2020 బ్యాచ్‌కు చెందిన సదరు ఎస్ఐ గతంలో కూడా అనేక అక్రమాలకు పాల్పడినట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి.
Abhishek Sharma: స్కెచ్ వేశాం.. అభిషేక్ శర్మను మొదటి బంతికే బుట్టలో వేస్తాం!
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!