NTV Telugu Site icon

Telangana Rains: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు..

Telangana Rains

Telangana Rains

Telangana Rains: తెలంగాణలో గత 15 రోజులుగా సరైన వర్షాలు లేవు. జూలై చివరి వారంలో దాడికి గురైన వరుణుడు ఆగస్టులో కనిపించకుండా పోయాడు. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రైతులకు ఆగస్టు చాలా ముఖ్యమైన నెల. కాయలు ఎదుగుదల దశలో ఉన్నందున వర్షాలు అవసరం కాగా గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వర్షాలు లేవు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌ కీలక ప్రకటన చేసింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Read also: Rice Water Health Benefits: గంజి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఇక వదలరు..

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. యాదాద్రి-భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, నల్గొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై కాలానుగుణంగా ప్రభావం ఉంటుందని, ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. సోమవారం సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌లోనూ సాయంత్రం వర్షం కురిసింది. వాతావరణం మేఘావృతమై ఉండడంతో.. ఎల్బీనగర్, వనస్థలిపురం, చైతన్యపురి, నాగోల్, హయత్ నగర్, మలక్ పేట్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. నగరంలో ఈరోజు ఉదయం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Aditya-L1: ఇక సూర్యూడి పైకి.. సెప్టెంబర్‌లో ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం