NTV Telugu Site icon

Fake Cakes: తక్కువ ధరకే కేక్.. కల్తీ కేటుగాళ్లపై పోలీసులు నజర్‌

Fake Cake Factory

Fake Cake Factory

Fake Cakes: హైదరాబాద్‌లో కల్తీ దందా జోరుగా సాగుతోంది. ఇటీవల నకిలీ ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తూ ఓ ముఠా పట్టుబడగా.. ఇప్పుడు కేకులు, స్వీట్లు తయారు చేస్తూ పట్టుబడుతుండడంతో.. ఏం తినాలన్నా భయపడుతున్నారు. నగరంలో కల్తీ పదార్థాలను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇటీవల నకిలీ నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలను తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కల్తీ కేక్‌లు తయారు చేస్తున్న ముఠాపై ఎస్‌వోటీ బాలానగర్ పోలీసులు దాడి చేశారు. బాచుపల్లి పరిధిలోని నిజాంపేటలోని బాలాజీ కేక్ ఫ్యాక్టరీలో కల్తీ కేకులు తయారు చేస్తున్నారనే సమాచారంతో సోదాలు చేశారు. కేకుల తయారీలో రసాయన రంగులు వాడుతున్నట్లు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో కేక్‌లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. యజమాని గోపాల కృష్ణ పరారీలో ఉండగా, అక్కడ పనిచేస్తున్న సయ్యద్ వాసిఫ్‌తో పాటు కేక్ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Read also: Nandakumar: GHMC కమిషనర్ పై చర్యలు తీసుకోండి.. హైకోర్ట్ ను ఆశ్రయించిన నందకుమార్

ఎక్స్‌పైర్ డేట్ క్రీములు, పాచిపోయిన కేక్ తయారీ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి కేక్‌లను తయారు చేసి ఇతర దుకాణాలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, లేబర్ లైసెన్స్ లేకుండానే కేక్ పరిశ్రమ నడుస్తోందని తేల్చారు. ఎస్‌ఓటీ పోలీసులు నిందితుడిని బాచుపల్లి పోలీసులకు అప్పగించారు. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొగల్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నకిలీ మిఠాయిల తయారీ ముఠా పోలీసులకు చిక్కింది. లాల్ దర్వాజా ప్రాంతంలోని ఓ ఇంట్లో నకిలీ మిఠాయిలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కలకన్, అజ్మీరీ కలకన్, ఖోవా వంటి స్వీట్లను నకిలీగా తయారు చేస్తున్నట్లు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. బాల్ గోపాల్ యోజన పథకం కింద రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న పాలపొడిని తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలించినట్లు వెల్లడైంది. ఈ పొడిని కేక్‌ల తయారీకి ఉపయోగిస్తారు. నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి మిఠాయిలు తయారు చేసి బ్రాండెడ్ కవర్లతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు. స్థానిక పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వీరిని రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది.
Variety Thief: అట్టముక్కతో దొంగతనం.. అడ్డంగా దొరికిపోయిన దొంగ