NTV Telugu Site icon

Hyderabad : మరోసారి భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే?

Chicken

Chicken

నాన్‌ వెజ్‌ ప్రియులకు గుడ్ న్యూస్. చికెన్ ధరలు మరోసారి తగ్గాయి.. గతకొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతోన్న చికెన్‌ ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. కార్తీక మాసం కావడంతో చికెన్‌ ధరలు భారీగా పడిపోయాయి. కరోనా సమయంలో ప్రజలు చికెన్‌ను విపరీతంగా తినేయడంతో ఒకానొక సమయంలో కిలో చికెన్‌ ధర ఏకంగా రూ. 300 వరకు చేరింది.. ఇప్పుడు సగానికి పడిపోయింది.. ఈరోజు ఇంకాస్త తగ్గినట్లు తెలుస్తుంది.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

మొన్నటివరకు ఎలెక్షన్స్ కావడంతో ధరలు ఊపంధుకున్నాయి.. అయితే ఇప్పుడు కార్తీక మాసంతో ధరలు ఒక్కసారిగా సగానికి సగం తగ్గాయి. దీంతో ప్రస్తుతం కిలో చికెన్‌ విత్‌ స్కిన్‌ రూ. 150, స్కిన్‌లెస్‌ రూ. 170కి పడిపోయింది. ఇప్పుడు మరో రూ. 20 తగ్గింది.. స్కిన్ లెస్ ధర రూ. 145 ఉండగా, డ్రెస్సుడ్ చికెన్ ధర ప్రస్తుతం రూ. 128 గా ఉంది.. ఇంకా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. గడిచిన నాలుగు నెలల్లో కిలో చికెన్‌ ధర చేరుకున్న కనిష్ట ధర ఇదే కావడం విశేషం. కోళ్లు ఒక పరిమాణానికి వచ్చిన తర్వాత కచ్చితంగా వాటిని అమ్మేయాల్సిందే. లేదంటే వాటికి మేత ఎక్కువవడంతో పాటు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. దీంతో మార్కెట్లో డిమాండ్‌ తగ్గి, భారీగా కోళ్లు రావడంతో ఆటోమేటిగ్‌గా ధర తగ్గుతుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది.. ఒకవైపు చలి తీవ్రత ఎక్కువ.. మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ధరలు పూర్తిగా తగ్గాయి.. కొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్‌ ధరలు ఏకంగా 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. కార్తీక మాసం ముగిసే సమయానికి చికెన్ ధరలు ఇలాగే ఉండే అవకాశాలున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.. కార్తీక మాసం తర్వాత ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది..

Show comments