Marriage Muhurat: పుష్య మాసం ముగిసి మాఘమాసం వచ్చింది. మాఘమాసంలో వివాహ శుభ కార్యాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్. ఈ రెండు మూడు నెలల్లో ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు, ఆలయాలు పెళ్లిళ్లతో సందడిగా మారాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఫిబ్రవరి 13 (మంగళవారం) నుంచి ఏప్రిల్ 26 వరకు దివ్య ముహూర్తాలు ఉన్నాయని.. ఈ 70 రోజుల్లో దాదాపు 30 శుభ ముహూర్తాలు ఉన్నాయని అర్చకులు తెలిపారు. ఇక పెళ్లిళ్లు, అక్షరాభ్యాసాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలతో బంధు మిత్రులతో సందడి వాతావరణం కనిపిచనుంది.. ఈ సీజన్‌లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2 లక్షల వివాహాలు జరుగుతాయని అంచనా.
Read also: Paytm : రోజు రోజుకు పెరుగుతున్న పేటీఎం కష్టాలు.. 9రోజుల్లో రూ.24వేల కోట్లు ఖతం
వసంత పంచమి-ప్రేమికుల రోజు..
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌లతో పాటు నవంబర్, డిసెంబర్‌లలో మంచి ముహూర్తాలు ఉంటాయని పండితులు తెలిపారు. దీంతో వివాహాలు, కొత్త గృహ ప్రవేశాలు, గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు జోరుగా సాగుతున్నాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న పెళ్లిళ్ల హడావుడి మరో మూడు నెలల పాటు కొనసాగుతుందని పురోహితులు చెబుతున్నారు. ఆ తర్వాత గురు మౌఢ్యం, శుక్ర మౌఢ్యం, శూన్య మాసాలు కావడంతో మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు. మాఘమాసంలో వసంత పంచమి రోజున ప్రతి సంవత్సరం వేల వివాహాలు జరుగుతాయి. సరస్వతీమాత జన్మదినం కావడంతో వసంత పంచమి నాడు శుభకార్యాలు, వివాహాలు నిర్ణయించబడతాయి. ఈ సంవత్సరం వసంత పంచమి ఫిబ్రవరి 14న అంటే ప్రేమికుల రోజున వస్తుంది. దీంతో పెళ్లికి సిద్ధమైన జంటలు ఈ రోజే కలిసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు.
Read also: CM YS Jagan: రేపు రెండు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ఫంక్షన్ హాళ్లు నిండిపోయాయి
పెళ్లిళ్ల సీజన్ అంటే పూలు, పండ్లు, ఇతర వ్యాపారాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, ఈవెంట్ ఆర్గనైజర్లు, డీజేలకు మంచి గిరాకీ ఉంది. ఈ మూడు నెలలు ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు పండగే. ఈ సీజన్ లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 60 వేల పెళ్లిళ్లు జరుగుతున్నట్లు సమాచారం. గతేడాది నవంబర్, డిసెంబర్‌లో ముహూర్తాలు తక్కువగా ఉండడంతో కొన్ని పెళ్లిళ్లు మాఘమాసానికి వాయిదా పడ్డాయి. ఇందుకోసం మూడు నాలుగు నెలల ముందుగానే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్, మియాపూర్, నార్సింగి, కోకాపేట్, ఎల్‌బీనగర్, చైతన్యపురి, కూకట్‌పల్లి, షాద్ నగర్ తదితర ప్రాంతాల్లోని భారీ ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్ల కోసం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లు పూర్తయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు.
UAE: నేడు యూఏఈలో హిందూ ఆలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ