హైదరాబాద్ నగరం మళ్ళీ మునిగింది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని నాగమయ్య కుంట నిండి.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దయానంద్ నగర్, సాయి చరణ్ కాలనీ ఇళ్లలోకి నీరు చేరడంతో ప తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. ఇంట్లో ఉన్న వస్తువులు బియ్యం, బట్టలు తడిసి పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. అయితే గత ఏడాది కురిసిన వర్షాల నుంచి జీహెచ్‌ఎంసీ గుణపాఠం నెరవలేదు అనిపిస్తుంది. నాలాల పూడికతీత పూర్తి కాకపోవడంతో మళ్ళీ మునిగిపోయింది హైదరాబాద్. చూడాలి మరి ముందు ముందు ఎం జరుగుతుంది అనేది.
మళ్ళీ మునిగిన హైదరాబాద్…
