NTV Telugu Site icon

హైదరాబాద్‌ మెట్రో సేవల సమయం పొడిగింపు

metro rail

metro rail

తెలంగాణలో లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. సడలింపుల సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కొత్త సడలింపులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.. మొత్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెసులుబాటు ఉండనుండగా.. మరో 12 గంటల పాటు.. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయనున్నారు. ఇక, లాక్‌డౌన్‌ సడలింపుల సమయం పెరగడంతో.. తన సేవల సమయాన్ని కూడా పొడిగించింది హైదరాబాద్ మెట్రో రైలు.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెట్రో సేవలను కొనసాగనున్నట్టు ప్రకటించారు.. అయితే, అన్ని చివరి స్టేషన్ల నుంచి సాయంత్రం 5 గంటలకు చివరి రైలు బయల్దేరుతుంది.. పొడింగించిన సమయం రేపటి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు హైదరాబాద్‌ మెట్రో రైలు అధికారులు.