హైదరాబాద్‌లో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత… ట్రాఫిక్ కష్టాలు తగ్గాయని చెబుతారు.. ఇక, ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో.. మెట్రో రైల్ సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.. లక్షలాది మంది హైదరాబాదీలు మెట్రోను వినియోగించుకుంటున్నారు.. దీంతో.. హైదరాబాద్ మెట్రో తాజాగా సరికొత్త రికార్డు సృష్టించింది… ఒకేరోజు 4 లక్షల మంది ప్రయాణం చేయడంతో.. ఈ తాజా రికార్డును అందుకుంది హైదరాబాద్ మెట్రో రైల్.. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సేవ సమయం పొడిగించినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే కాగా… అందుకు అనుగుణంగా.. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి (శనివారం) అర్థరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులను నడిపారు. గణేష్ నిమజ్జనం రోజున ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మెట్రోరైలు సమయాన్ని పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది… ఇక, మెట్రో రైలులో ఒకే రోజు 4 లక్షల మంది ప్రయాణం చేయడంతో.. కొత్త రికార్డు నెలక్పొంది..
Read Also: Cheating Case: టీడీపీ అధికార ప్రతినిధిపై హైదరాబాద్‌లో కేసు.. రూ.20 వేలు తీసుకొని ఇలా..!
ఒక్క మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్‌లోనే 2.46 లక్షల మంది ప్రయాణికులు మెట్రో సర్వీసులను ఉపయోగించుకోగా… నాగోల్-రాయదుర్గం మార్గంలో 1.49 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేశారు.. ఇక, జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్‌లో 22 వేల మంది ప్రయాణo చేశారని.. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రకటించింది… అత్యధికంగా ఖైరతాబాద్ స్టేషన్‌లో 22 వేల మంది రైలు ఎక్కగా, 40 వేల మంది రైలు దిగినట్టు పేర్కొంది.. కాగా, గణేష్ నిమజ్జనం రోజు ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా.. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రత్యేకంగా సమయం పొడిగించి మెట్రో సర్వీసులను నడిపింది.. శుక్రవారం ఉదయం 6 గంటల.. అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సర్వీసులు తిరిగాయి.. చివరి మెట్రో రైలు సెప్టెంబర్ 10న ఒంటిగంటకు బయలుదేరి దాదాపు రెండు గంటల సమయంలో సంబంధిత స్టేషన్లకు చేరుకుంది.. ఇక, ఇవాళ తిరిగి ఉదయం ఆరుగంటల నుంచి మెట్రో సేవలు యథావిథిగా నడుస్తున్న విషయం తెలిసిందే. మొత్తంగా వినాయకుడి ఎఫెక్ట్‌తో.. హైదరాబాద్ మెట్రో కొత్త రికార్డు సృష్టించింది.