NTV Telugu Site icon

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. ఛార్జీలు, పెంపు ఎంతంటే !

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు త్వరలో బ్యాడ్ న్యూస్ అందనుంది. మెట్రో రైలు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఛార్జీల పెంపుపై హైదరాబాద్ మెట్రో అధికారులు ఇప్పటికే సెంట్రల్ ఫేర్ ఫిక్సేషన్ కమిటీకి ప్రతిపాదనలు పంపారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి శ్యామ్ ప్రసాద్ చైర్మన్‌గా, కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి సురేంద్ర కుమార్ బాగ్డే, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. గత నెలలో సమావేశమైన కమిటీ సభ్యులు కూడా మెట్రో రైలు ఛార్జీల సవరణకు సంబంధించి ప్రజల అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తీసుకున్నారు. దీంతో త్వరలోనే ఛార్జీలు పెరగనున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read also:Naga Babu: మంత్రి అంబటికి కౌంటర్.. సోది ఆపి పోలవరం సంగతి చూడు..!!

మెట్రో నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచనల మేరకు టికెట్ ధరలను పెంచేందుకు ఎల్ అండ్ టీ సంస్థ సన్నాహాలు చేస్తోంది. కొత్త టికెట్ ధరలను కొత్త ఏడాది జనవరి నుంచి అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. కోవిడ్ కారణంగా నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న హైదరాబాద్ మెట్రో మూడు లైన్ల ద్వారా ప్రతిరోజూ 4.20 లక్షల నుంచి 4.50 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ఇప్పుడు సమయంతో సంబంధం లేకుండా మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలో ధరలు పెంచి నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు మెట్రో ప్రయత్నిస్తోంది. ఒక్కసారి మెట్రో చార్జీలు పెంచితే మరో ఐదేళ్ల వరకు పెంచే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను బేరీజు వేసుకుని చార్జీలు ఎంత పెంచాలనే దానిపై కసరత్తు చేసినట్లు సమాచారం.

Read also: Police Jobs: గుడ్ న్యూస్.. వారికి ఈవెంట్స్‌ లేవు డైరెక్ట్‌గా మెయిన్సే

ప్రస్తుతం మెట్రో టికెట్ ధరలు
2 కిలోమీటర్ల దూరానికి టిక్కెట్ ధర రూ.10.
2-4 కి.మీ దూరానికి 15,
4-6 కి.మీ. దూరానికి రూ.25,
6-8 కి.మీ. దూరానికి రూ.30,
8-10 కి.మీ. దూరానికి రూ.35,
10-14 కి.మీ. దూరానికి రూ.40,
14-18 కి.మీ. దూరానికి రూ.45,
18-22 కి.మీ. దూరానికి రూ.50,
22-26 కి.మీ. దూరానికి 55,
26 కిలోమీటర్లకు పైగా దూరానికి రూ.60 టికెట్ ధర వసూలు చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం రూ.10 ఉన్న తొలి టికెట్ ధరను రూ.20, గరిష్ట ధర రూ.60 నుంచి రూ.80 వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Naga Babu: మంత్రి అంబటికి కౌంటర్.. సోది ఆపి పోలవరం సంగతి చూడు..!!

Show comments