NTV Telugu Site icon

Hyderabad Metro: హైదరాబాద్‌ వాసులకు శుభవార్త.. మెట్రో వేళలు పొడిగింపు..!

Nampalli Numaish

Nampalli Numaish

Hyderabad Metro:: 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్-2024) హైదరాబాద్‌లోని నాంపల్లి గ్రౌండ్స్‌లో ప్రారంభమైంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ తెరవబడుతుంది. అయితే.. ఈ ఎగ్జిబిషన్‌కు నగరం నలుమూలల నుంచి సందర్శకులు పోటెత్తారు. ఇదిలా ఉండగా.. ఎప్పటిలాగే సందర్శకుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని.. హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సందర్శకుల కోసం మెట్రో రైళ్ల వేళలను అర్ధరాత్రి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మియాపూర్ – ఎల్బీనగర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో మెట్రో రైలు మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంటకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. మెట్రో స్టేషన్లలో నుమాయిష్ సందర్శకుల కోసం ప్రత్యేక టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు. కాగా, నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడపనుంది. దాదాపు 22 లక్షల మంది ఈ ప్రదర్శనను సందర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

Read also: WhatsApp: 71 లక్షల అకౌంట్స్ బ్యాన్ చేసిన వాట్సాప్

నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రవేశ టిక్కెట్ ధర రూ.40గా నిర్ణయించారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ టైమింగ్స్.. వారాంతపు రోజులలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు.. వారాంతాల్లో, సెలవు దినాల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సందర్శించే అవకాశం కల్పించారు. అయితే.. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు వాహనాలతో లోపలికి వెళ్లి దర్శించుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. అయితే.. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్‌లో దేశం నలుమూలల నుంచి వ్యాపారులు వచ్చి స్టాళ్లను ఏర్పాటు చేసారు. దాదాపు 2400 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చేనేత వస్త్రాల నుండి వంట సామాగ్రి వరకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇందులో ఫుడ్ కోర్టులు కూడా ఉన్నాయి.
Electoral Bonds: ఇవాళ్టి నుంచి ఎలక్టోరల్ బాండ్ల విక్రయం ప్రారంభం..