Hyderabad Metro: ఆదివారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించి మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు నగరంలోని నలుమూలల నుంచి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. క్రికెట్ అభిమానుల కోసం హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రత్యేక ట్రిప్పులు నడిపింది. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని గతంలోనే ప్రకటించగా… అభిమానులు ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. సొంత వాహనాలపై వెళ్లి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం కంటే మెట్రోరైలులో ప్రయాణించడం మేలు అని ఫిక్స్ అయ్యారు.
Read Also: Earth is Flat not Round: భూమి గుండ్రంగా లేదు..!
దీంతో మ్యాచ్ మొదలు కావడానికి రెండు మూడు గంటల నుంచే స్టేడియానికి చేరుకునేందుకు అభిమానులు పోటెత్తడంతో మెట్రో రైళ్లు దూరేందుకు సందు లేనంతగా నిండిపోయాయి. ముఖ్యంగా సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య మెట్రో స్టేషన్లు అన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ మ్యాచ్ పూర్తయ్యాక రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఉప్పల్, ఎన్‌జీఆర్ఐ స్టేషన్లు జాతరను తలపించాయి. ఈ రెండు స్టేషన్ల నుంచి మాత్రమే ఆ సమయంలో ప్రయాణికులను అనుమతించారు. అయితే సెలవు రోజు అయినప్పటికీ ఆదివారం ఒక్కరోజే ఎల్‌బీ నగర్-మియాపూర్, నాగోలు-రాయదుర్గం రూట్లలో ఏకంగా మూడున్నర లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
