భూమి మీద ఎన్నో వింతలు ఉన్నాయని తెలిసిన చాలామందికి భూమి కూడా
ఓ వింత అని తెలియదు.
ఈరోజు మనం మన ఎర్త్ గురించి మాట్లాకుందాం.
అందరూ అనుకుంటున్నట్లు భూమి పూర్తి గుండ్రంగా లేదు.
ఇంకా చెప్పాలంటే కొంతకాలంగా ఆకారం మారుతూ వస్తోంది.
ఇటీవల కరుగుతున్న హిమప్రాంతాలతో భూమి ఆకారం మారుతోందని నాసా జెట్ ప్రపొల్యుషన్ ల్యాబ్ తెలిపింది.
4.6 బిలియన్ సంవత్సరాలు క్రితం భూమి ఏర్పడినప్పుడు ఒక రోజు వ్యవధి ఆరు గంటలే కాగా.. మిలియన్ల సంవత్సరాల క్రితం ఇది 21.9 గంటలకు పెరిగింది.
ప్రస్తుతం 24. గంటలుగా ఉన్నా.. ప్రతి వంద సంవత్సరాలకు ఓ సారి 1.7 మిల్లీ సెకన్లు పెరుగుతోంది.
ఇప్పుడు ప్రపంచంలో ఏడు ఖండాలున్నా 800 మిలియన్ల సంవత్సరాల క్రితం ఇవి లేవు. భూ ఫలకల కదలికలతో ఖండాలు ఏర్పడ్డాయి.
‘ఫ్లాట్ ఎర్త్’ అని కొడితే యూట్యూబ్‌లో పది లక్షల వీడియోలు, వెబ్‌లో నాలుగు లక్షల పత్రాలు కనిపిస్తాయి.
వాటిలో సగం భూమి బల్లపరుపుగా ఉన్నాయనే వాదిస్తాయి.