NTV Telugu Site icon

Hyderabad Metro: క్రికెట్ అభిమానులకు మెట్రో బంపర్‌ ఆఫర్‌ కానీ.. చిన్న ట్విస్ట్

Hyderabad Metro

Hyderabad Metro

Hyderabad metro good news to cricket fans: ఈనెల 25న (రేపు) ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు మెట్రో సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇక ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చినవారికి వీలుగా రేపు రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు స్పెషల్ మెట్రో రైలు సర్వీసులు నడవనున్నాయి..

రాత్రి 10 గంటల వరకే టికెట్ కౌంటర్లు

కానీ ఇందులో చిన్న ట్విస్ట్‌ ఉందండి.. అదేంటంటే.. ఈస్పెషల్‌ సర్వీసులు కేవలం స్టేడియం స్టేషన్‌ నుంచే ఉంటాయి. కాగా, అమీర్‌పేట్.. జేబీఎస్ స్టేషన్ల నుంచి కనెక్షన్ ట్రైన్ సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయి.. అటు ప్రత్యేక రైళ్లు నడిచే సమయంలో ఉప్పల్, స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ మెట్రో స్టేషన్లలో మాత్రమే ఎంట్రీ గేట్స్ తెరిచి ఉంటాయని మెట్రో అధికారులు స్పష్టం చేశారు. అయితే.. దిగబోయే ప్రయాణీకుల కోసం మిగతా స్టేషన్లలో ఎగ్జిట్ గేట్స్ ఓపెన్ చేసి ఉంటాయని తెలిపారు. ఇక.. “మెట్రో స్టేషన్లలో రాత్రి 10 గంటల వరకే టికెట్ కౌంటర్లు తెరిచి ఉంటాయని, రిటర్న్ టికెట్లు కొనుగోలు చేసేవారు రాత్రి 10 గంటలలోపు తీసుకోవాలని” సూచించారు. అయితే.. రాత్రి 10.15 గంటల తర్వాత నుంచి డిజిటల్ టికెట్స్ కొనుగోలుకు ఛాన్స్ ఉండదని ప్రకటించారు.

టీఎస్ఆర్టీసీ కూడా గు‌డ్‌న్యూస్ చెప్పింది. రేపు ఉప్పల్ స్టేడియంలో ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న నేపధ్యంలో ప్రయాణీకుల సౌకర్యం కోసం సిటీ బస్సు సర్వీసులను పొడిగించింది. దీంతో.. ఉప్పల్ స్టేడియం నుంచి ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఈనేపథ్యంలో.. ఆర్టీసీ సికింద్రాబాద్‌ రీజియన్‌ మేనేజర్‌ సీహెచ్‌ వెంకన్న వెల్లడించారు. దీంతో.. సికింద్రాబాద్‌, జేబీఎస్‌, జీడిమెట్ల, ఘట్‌కేసర్‌, కోఠి, మోహిదీపట్నం, మేడ్చల్‌, హకీంపేట్‌, పటాన్‌చెరు వంటి వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియం వరకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. ఇక ప్రయాణీకులు దృష్టిలో పెట్టుకుని ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

Read also: Sitaram Yechury: మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

ఏక్ మీనార్ వద్ద ఎలాంటి పార్కింగ్‌కి అనుమతి లేదు

ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో.. ఎటువంటి అనివార్య సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. మొత్తం 40 వేల మంది క్రీడాభిమానులు మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియంకి వస్తారని, ట్రాఫిక్, లా & ఆర్డర్ సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. మొత్తం 2500 మంది సిబ్బందితో ఈ ఏర్పాట్లు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఉప్పల్ స్టేడియం బయటున్న అప్రోచ్ రోడ్లను తమ అధీనంలోకే తీసుకున్నామని సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఆటగాళ్లందరూ ఈరోజు రాత్రికి నాగ్‌పూర్ నుంచి వస్తున్నారని.. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నింటిని రెండు హోటల్స్‌లో జరిగాయని అన్నారు.

స్టేడియం వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని, 300 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. 21 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని, గేట్ నం.1 ద్వారా విఐపీ, వివిఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సిద్ధం చేశామని వెల్లడించారు. ఒక్కొక్క పార్కింగ్‌లో 1400 ఫోర్ వీలర్స్ పట్టేలా ప్రత్యేక పార్కింగ్స్ ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు. స్టేడియం చుట్టూ మూడు జంక్షన్లు ఉన్నాయని.. సాయంత్రం నాలుగు గంటల నుండి స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదని సీపీ తేల్చేశారు. మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్న ఆయన.. ఏక్ మీనార్ వద్ద ఎలాంటి పార్కింగ్‌కి అనుమతి లేదన్నారు. సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఒంటి గంట దాకా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఐదు మొబైల్ పార్కింగ్‌లతో పాటు ఎమర్జెన్సీ వాహనాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు సీపీ మహేశ్ భగవత్ చెప్పుకొచ్చారు.
PFI: భారత్‌ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర.. ఎన్ఐఏ రిపోర్టులో సంచలన విషయాలు

Show comments