Telangana Rains: తెలంగాణకు సంబంధించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా మధ్యాహ్నం పూట ఎండలు, రాత్రిపూట ఎముకలు కొరికే చలితో రాష్ట్ర ప్రజలు రెండు రకాల వాతావరణాన్ని చూస్తున్నారు. అయితే మిగిలిన వరుణుడు కూడా ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే తమిళనాడు రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఆకాశం మేఘావృతమై ఉందని, పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, తెలంగాణలో పగటిపూట ఎండలు మండిపోతుండగా, రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
Israel Hamas War: కిడ్నాప్ చేసి బట్టలిప్పి వీధుల్లో ఊరేగించి చంపేశారు