NTV Telugu Site icon

హైదరాబాద్‌లో చీటర్‌కు చెప్పుదెబ్బలతో బుద్ధి చెప్పిన మహిళ

హైదరాబాద్‌లో చీటర్‌కు బుద్ధి చెప్పిందో మహిళ. హైదరాబాద్‌ గౌతమీనగర్‌కు చెందిన సయ్యద్‌ అహ్మద్‌ బాలానగర్‌ కార్పొరేటర్‌ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఓ వివాహితకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఇప్పిస్తానని నమ్మించాడు. ఆమె దగ్గర 10 లక్షలు వసూలు చేశాడు. రోజులు గడుస్తున్నా ఇల్లు రాకపోవడంతో ఆమె… నిందితుడిని నిలదీసింది. తన డబ్బులు ఇచ్చేయాలని కోరింది. డబ్బులు ఇవ్వనని.. ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చన్నాడు. అంతేకాదు మళ్లీ డబ్బులు అడిగితే ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె నిందితుడు పనిచేస్తున్న కార్పొరేటర్ ఆఫీసుకెళ్ళి చెప్పుతో కొట్టింది. కార్పొరేటర్‌ సమాచారం ఇవ్వడంతో అహ్మద్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అతడిపై చీటింగ్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసారు. ఆమెపై కూడా 324 కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.