Site icon NTV Telugu

HYDRA : హైడ్రాను అభినందించిన హైకోర్టు.. ప్రజా ఆస్తులను కాపాడడానికి హైడ్రా అవసరమంటూ కితాబు

Hydraa

Hydraa

HYDRA : హైదరాబాద్‌ను పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న హైడ్రాను హైకోర్టు అభినందించింది. ప్రజావసరాల కోసం ఉద్దేశించిన స్థలాలు, రహదారులు, పార్కులను కాపాడేందుకు హైడ్రా వంటి సంస్థలు అవసరమని హైకోర్టు పేర్కొంది. రహదారులపై రాకపోకలకు ఆటంకంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని న్యాయమూర్తి అన్నారు. అంతేకాకుండా, ప్రజా ఆస్తులు, నీటి వనరులను కాపాడడంలో నగరం అంతటా హైడ్రా చేస్తున్న కార్యక్రమాలను కూడా కోర్టు ప్రశంసించింది.

Minor: కర్ణాటకలో దారుణం.. వాష్ రూమ్ లో బిడ్డను కన్న బాలిక

రాంనగర్‌లోని మనేమ్మ గల్లీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రోడ్డు ఆక్రమణపై జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఆక్రమణను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ హైడ్రా సహకారం కోరింది. దీంతో హైడ్రా రంగంలోకి దిగి జమినిస్తాన్‌పూర్, రాంనగర్ క్రాస్ రోడ్స్‌లో రోడ్డును ఆక్రమించి నిర్మించిన వాణిజ్య సముదాయాన్ని తొలగించింది. ఈ విషయమై ఆ వాణిజ్య సముదాయం యజమాని హైకోర్టును ఆశ్రయించగా, గురువారం విచారణ జరిగింది. ఈ విచారణలో, రహదారులను ఆక్రమించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే నిర్మాణాలను తొలగించడంలో హైడ్రా వంటి సంస్థలు ఎంతగానో ఉపయోగపడతాయని హైకోర్టు స్పష్టం చేసింది.

Mirai: కంటెంట్‌ను నమ్మాం.. రేట్లు పెంపకం కాదు

Exit mobile version