రోజు రోజుకు రోడ్లపై వాహనాల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో పాదాచారులు రోడ్డు దాటేందుకు కష్ట పడాల్సి వస్తుంది. ఒక్కోసారి రోడ్డు దాటే టైంలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వీటితోపాటు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, జంక్షన్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్కైవాక్ నిర్మాణాలపై దృష్టి పెట్టింది.
Read Also: Gold Rush at Uppada Beach: సముద్ర తీరంలో బంగారు రేణువులు కోసం ఎగబడిన జనం
గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జనసంచారం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా వాహనాలు నడుపుతుంటారు. దీంతో హైదరాబాద్ మహానగరంలో పాదచారుల కోసం మరో ఆరు స్కైవాక్స్ నిర్మించాలని హెచ్ఎండీఏ కసరత్తు చేస్తున్నది. ఇప్పటి వరకు నగరంలో 23 ప్రాంతాల్లో స్కైవాక్స్ అవసరమని హెచ్ఎండీఏ గుర్తించింది. అందులో ఇప్పటికే ఉప్పల్ జంక్షన్ లో ఈ స్కైవాక్ నిర్మాణం పూర్తయింది. ఈ స్కైవాక్ ల నిర్మాణం పూర్తయితే.. పాదాచారులు ప్రశాంతంగా వారి గమ్య స్థానాలకు వెళ్లేందుకు సులభంగా ఉంటుంది. ఇప్పటికే ఉప్పల్ లో స్కైవాక్ ఏర్పాటు చేయగా.. దానిని ఉపయోగించి పాదాచారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి ప్రాంతాలకు వెళుతున్నారు.
Read Also:Digital Car Key: ఇకపై ఫోన్ తోనే కార్ అన్ లాకింగ్..కొత్త ఫీచర్ తో వస్తున్న శాంసంగ్ గెలాక్సీ
అఫ్జల్‌గంజ్, మదీన, లక్డీకాపూల్ పెట్రోల్‌బంక్, బీహెచ్‌ఈఎల్, జేఎన్‌టీయూ, మియాపూర్ టీ జంక్షన్లలో స్కైవాక్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు ఆదేశాలిచ్చింది. కూకట్ పల్లి జేఎన్‌టీయూ జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ తోపాటు పాదచారుల రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. రోడ్డు దాటాలంటే పాదచారులకు గగనంగా మారింది. ట్రాఫిక్ జామ్ కావడానికి పాదచారుల రాకపోకలు కారణంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పల్ తరహాలో భారీ స్కైవాక్ నిర్మించాలని హెచ్ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. సికింద్రాబాద్‌లో కూడా రైల్వేస్టేషన్‌కు, మెట్రో స్టేషన్లకు, బస్టాండ్‌లకు అనుసంధానంగా స్కైవాక్ నిర్మాణానికి హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తున్నది. దీనికి సంబంధించిన డిజైన్ కూడా తయారు చేశారు. ప్రస్తుతం మెహిదీపట్నంలో స్కైవాక్ నిర్మాణ పనులు ఫాస్ట్ గా జరుగుతున్నాయి.
Read Also:RTC Bus Stuck: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
అయితే కూకట్ పల్లిలో నిర్మించే ఈ స్కైవాక్ జేఎన్‌టీయూ జంక్షన్, మెట్రో స్టేషన్, బస్‌స్టేషన్, లూలూ మాల్ వంటి ప్రాంతాలను కలుపుతుంది. అయితే జేఎన్‌టీయూ క్యాంపస్ కేంద్రం నుంచి మెట్రోస్టేషన్, లూలూమాల్, ప్రగతినగర్, నిజాంపేట్ మార్గాల్లో వెళ్లే పాదచారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. స్కైవాక్స్ తో జేఎన్టీయూ క్యాంపస్ విశ్రాంతి జంక్షన్ మారనుందని అధికారులు చెబుతున్నారు.
