Gas Cylinder Scam : కొరత పేరుతో కుంభకోణం.. శ్మశానంలోనే సిలిండర్ సీక్రెట్.!
- శ్మశానంలో గ్యాస్ మాఫియా గుట్టు రట్టు
- 414 సిలిండర్లు, 11 వాహనాలు సీజ్
- కొరత పేరుతో మూడింతల ధరల దోపిడి
- ముఠా సూత్రధారి సహా 10 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న భారీ దందాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. పంజాగుట్టలోని ఒక శ్మశాన వాటికను అడ్డాగా చేసుకుని, అక్కడ సిలిండర్లను నిల్వ ఉంచి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాపై డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నేతృత్వంలోని బృందం మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు 414 గ్యాస్ సిలిండర్లతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న 11 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు శంషాబాద్‌లో గ్యాస్ గోదాంను, అఫ్జల్‌గంజ్‌లో కార్యాలయాన్ని నిర్వహిస్తూ గత ఏడాదిన్నర కాలంగా ఈ అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు విచారణలో తేలింది. బంజారాహిల్స్‌కు చెందిన మహమ్మద్ అమీర్ ఈ ముఠాకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తుండగా, అతనితో పాటు మరో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read
ప్రస్తుతం ఇరాక్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా గ్యాస్ కొరత ఏర్పడనుందనే తప్పుడు ప్రచారాన్ని నిందితులు ఆసరాగా చేసుకున్నారు. మార్కెట్‌లో కృత్రిమ కొరతను సృష్టించి, రూ. 2 వేల చిల్లర ఉండే కమర్షియల్ సిలిండర్‌ను ఏకంగా రూ. 6 వేల పైచిలుకు ధరకు విక్రయిస్తూ సామాన్యులను దోచుకుంటున్నారు. పక్కా సమాచారంతో నిందితులపై నిఘా ఉంచిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు, శ్మశాన వాటికలో దాచి ఉంచిన వివిధ రకాల హెచ్.పీ గ్యాస్ సిలిండర్లను (47 కిలోలు, 19 కిలోలు , 5 కిలోలవి) బయటకు తీశారు. ప్రజల అవసరాలను పెట్టుబడిగా మార్చుకుని అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను తదుపరి విచారణ నిమిత్తం సివిల్ సప్లై విభాగానికి అప్పగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!