Hyderabad Doctor: హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ సుమధుర గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ 17వ తేదీన నిర్వహించిన ‘మాస్ పార్టిసిపేషన్ ఈవెంట్’కి గాను ఆమె ఈ ఘనత సాధించారు. ఆ ఈవెంట్‌లో 117 దేశాలకు చెందిన 1465 మంది వ్యక్తులు పాల్గొన్నారు. వాళ్లందరూ గంట వ్యవధిలోనే ఒక్కొక్కటి చొప్పున బ్లాక్ అండ్ వైట్ డ్రాయింగ్ ఫొటోను ఓ లింక్ ద్వారా ఫేస్‌బుక్ అనే ప్రముఖ సామాజిక మాధ్యమంలోకి అప్‌లోడ్ చేశారు. అందులో 832 పోస్టులు వ్యాలిడ్ అని తేలింది. దీంతో ఈ ఈవెంట్‌ని ‘గిన్నిస్ రికార్డ్’గా గుర్తించారు.
సుమధురతోపాటు మరో ముగ్గురు కూడా ఈ టైటిల్‌ని కైవసం చేసుకున్నారు. డ్రాయింగ్ ఆఫ్ నేచర్ అనే గ్రూప్‌ని క్రియేట్ చేసిన ఈమె గతేడాది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం గమనార్హం. డాక్టర్ సుమధుర వృత్తిరీత్యా దంత వైద్యురాలు. ఆర్ట్ అంటే ఆమెకు విపరీతమైన ఇష్టం. సోదరి సింధూరతో కలిసి సిమ్-సుమ్ ఆర్ట్స్ అనే సంస్థని 2009లో హైదరాబాద్‌లోని కొత్తగూడలో స్థాపించారు. సింధూర కూడా డాక్టరే కావటం చెప్పుకోదగ్గ విషయం. సిమ్-సుమ్ అంటే సింధూర-సుమధుర అనుకుంటా.
Bharat Bill Payment System: ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ‘భారత్’లోనూ బిల్లులు కట్టొచ్చు
ఈ సోదరీమణులు త్వరలో హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సిమ్-సుమ్ అనే పేరుతోనే ‘ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్’ కాలేజీని ఓపెన్ చేయాలని అనుకుంటున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఈవెంట్‌లో డాక్టర్ సింధూర సైతం పాల్గొన్నారు. ఈమెతోపాటు పాల్గొన్న మొత్తం 150 మందికి కూడా త్వరలో ‘గిన్నిస్’ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు రానున్నాయి. ఈ జాబితాలో మయంక్ వ్యాస్, రోమా జి గిరీష్, మిథురాయ్ తదితరులు ఉన్నారు. మయంక్ వ్యాస్ ఈ ఈవెంట్ ఆర్గనైజర్. ఇండోర్‌కి చెందిన ఈయన రాడార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాకుడు. రోమా జి గిరీష్ బెంగళూరువాసి. మిథు రాయ్.. సిలిగురికి చెందినవారు.
కళపై ఆసక్తి కలిగిన 1465 మందిని ఒకేసారి ఏకతాటిపైకి తీసుకురావటం మామూలు విషయం కాదని చెప్పొచ్చు. ఎంతో కృషి, పట్టుదల, ప్రణాళిక, తపన ఉంటే తప్ప ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించటం సాధ్యం కాదు. ఒక వైపు వైద్యురాలిగా పనిచేస్తూనే మరో వైపు ఆర్ట్‌కి టైమ్ కేటాయిస్తుండటం అభినందనీయం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ని సాధించటం ద్వారా డాక్టర్ సుమధుర వ్యక్తిగతంగా తనకు, అదే సమయంలో హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారనటంలో అతిశయోక్తి లేదు.