Cyber Fraud : హైదరాబాద్‌లో ఓ 68 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి సైబర్ కేటుగాళ్ల మోసానికి గురయ్యాడు. నేరస్తులు తనను భయపెట్టడానికి పహల్గాం టెర్రర్ ఘటనను పునర్వినియోగం చేసుకున్నారు. ఫోన్‌లో మోసపోయిన వ్యక్తికి “పహల్గాం ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, ఫండ్ రైజ్ చేసి మనీలాండరింగ్ చేశారు” అని అంటూ మోసం చేశారు.
US Afghanistan Tensions: ట్రంప్ ఎఫెక్ట్.. తాలిబన్ సుప్రీం లీడర్‌కు హైసెక్యూరిటీ..!
నేరస్తులు తమను “యాంటీ టెర్రర్ స్వాడ్” అనే అధికారులుగా పరిచయం చేసి, డిజిటల్ అరెస్ట్ ఉంటుందని భయపెట్టారు. భయభ్రాంతులు వచ్చిన బాధితుడు నేరస్తులకు మొత్తం 26.06 లక్షల రూపాయలు చెల్లించాడు. భార్య పేరుతో ఉన్న 20 లక్షల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్ ను కూడా నేరస్తులకు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వెల్లడించినప్పుడు వారు మోసపోయినట్లు గుర్తించారు.
భయంతో బాధితుడు వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. పోలీసులు, “డిజిటల్ అరెస్ట్ అనే చర్య ఉండదు. ఎవరైనా కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అని మభ్యపెడితే వెంటనే పోలీసులను సంప్రదించండి” అని ప్రజలకు హెచ్చరించారు. ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే వెంటనే పోలీస్‌కు ఫిర్యాదు చేయాలని, వ్యక్తిగత బ్యాంక్ వివరాలు ఎవరికి ఇవ్వకూడదని మరోసారి గుర్తు చేశారు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నేరస్తులను త్వరలో గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
AP Legislative Council: మండలిలో బొత్స vs లోకేష్.. మాటల యుద్ధం
