Site icon NTV Telugu

Hanumakonda Crime: నువ్వు చచ్చిపోతే నేను వేరేపెళ్లి చేసుకుంటా.. భార్య మాటలకు భర్త ఆత్మహత్య

Hanumakonda Crime

Hanumakonda Crime

కోవిడ్‌ మహ్మరి కారణంగా టెక్‌ కంపెనీలన్నీ ఉద్యోగులను అందరికి వర్క్‌ ఫ్రం హోం ఇచ్చారు. అత్తింటి పోరు తట్టుకోలేక పోతున్నా అంటూ హైదరాబాద్‌లో కాపురం పెడతామంటూ రోజూ భర్తను వేధించేది భార్య. అత్తమామలు కూడా ఆభర్తకు వేధింపులు ఎదురయ్యాయి. అయినా కూడా భర్త, భార్యను సహిస్తూ వచ్చాడు. తను గర్భవతి కావడంతో.. ప్రతీదీ సహిస్తూ భరించాడు. తన భార్య ఐదు నెలల గర్భవతి కావడంతో.. తన పుట్టింటికి వెళ్లింది. భార్య కు కాల్ చేసాడు భర్త. వీడియో కాల్‌ మాట్లాడుతూనే ఆమె భర్తపై విరుచుకుపడింది. నువ్వు చచ్చిపోతే నేను వేరే పెళ్లి చేసుకుంటా అంటూ తెలిపింది. అది భరించని భర్త మనస్తాపానికి గురయ్యాడు. మనోవేదనకు గురయ్యాడు. చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన కొండా రాకేష్‌ హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇక రాకేష్‌ గత ఫిబ్రవరిలో వరంగల్‌ జిల్లా సంగెం మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన దేవులపల్లి నిహారికతో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. భర్త రాకేష్‌కు వర్క్‌ ఫ్రం హోం ఇవ్వడంతో ఇంటి నుంచే పనిచేస్తుండేవాడు. ఇక కొంత కాలం సజావుగా ఉన్నా భార్య నిహారికకు పల్లెటూరులో ఉండటం ఇష్టంలేక హైదరాబాద్‌కు వెళ్దామని భర్తను తరచూ పోరు పెట్టేది. దీంతో.. వర్క్‌ ఫ్రం హోం పూర్తికాగానే హైదరాబాద్‌కు వెళ్దామని రాకేష్‌ చెప్పినా రోజూ ఇదే విషయమై భార్యభర్తలిరువురూ వాదులాడుకునేవారు. ఈనేపథ్యంలో.. 5 నెలల గర్భవతైన నిహారిక పుట్టింటికి చేరింది.. ఏమైందో ఏమోకానీ గత కొద్ది రోజుల కిందట నీహారిక భర్త రాకేష్‌కు వీడియోకాల్‌ చేసి నువ్వు చనిపోతే నేను వేరేపెళ్లి చేసుకుంటానని చెప్పింది. దానికితోడు అత్తామామలు చీటికిమాటకి సూటిపోటి మాటలతో వేధించేవారు. రకేష్‌ తీవ్ర మనస్తాపానికి గురైన రాకేష్‌ సూసైడ్‌ నోట్‌ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. సూసెడ్‌ నోట్‌ ఆధారంగా మృతుడి భార్యతో పాటు అత్తా మామలైన అరుణ, శంకర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Asia Cup 2022: పాకిస్థాన్ బౌలర్‌ను పరామర్శించిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో వైరల్

Exit mobile version