Site icon NTV Telugu

Hyderabad Cp Cv Anand: డ్రగ్స్ రహిత హైదరాబాద్ మా లక్ష్యం

హైదరాబాద్ ని డ్రగ్స్ మత్తు చుట్టేస్తోంది. సెలబ్రిటీలు, సినీతారలు, పారిశ్రామిక వేత్తలు, వీఐపీల సంతానం.. డ్రగ్స్ బారిన పడుతున్నారు. హైదరాబాద్ ని డ్రగ్స్ రహిత నగరంగా మారుస్తామని, అందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు సీపీ సీవీ ఆనంద్. హైదరాబాద్ లో యువత ఎక్కువగా డ్రగ్స్ వాడుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న సంపన్నులు ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ తెప్పించుకొని వారికి తెలిసిన వాళ్ళ కు అలవాటు చేస్తున్నారన్నారు.

హైదరాబాద్ కొన్ని ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో పిల్లలు కూడా డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు సమాచారం ఉంది. గంజాయి ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతంలో, మన తెలంగాణలో ఏటూరు నాగారంలో ఏరియాలో సీక్రెట్ గా గంజాయి సాగు చేస్తున్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి డివిజన్ లో ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహిస్తామన్నారు ఆనంద్.

https://ntvtelugu.com/minister-ktr-tweets-about-cm-kcr-fighting-for-telangana/

డ్రగ్స్ రహిత హైదరాబాద్ ప్రోగ్రాంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి. డ్రగ్స్ వాడుతున్న, విక్రయం జరుగుతున్న పోలీసులకు సమాచారం ఇవ్వండి. తెలంగాణలో డ్రగ్స్ పూర్తిగా నిర్మూలన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమీక్షా సమావేశంలో ఆదేశించారు. నిర్మూలన కోసం నార్కోటిక్ వింగ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు సీపీ ఆనంద్.

Exit mobile version