99 శాతం మంది లాక్‌డౌన్‌ను సహకరిస్తున్నారని తెలిపారు హైదరాబాద్ పోలీస్ కమిషన్ అంజనీ కుమార్.. పాతబస్తీ, సౌత్ జోన్, సెంట్రల్ జోన్‌లో లాక్ డౌన్ అమలు తీరును పర్యవేక్షించిన ఆయన.. పాతబస్తీ మదిన చెక్ పోస్ట్‌ను పరిశీలించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో లాక్ డౌన్ అమలు అవుతుందని.. 99 శాతం ప్రజలు పోలీసులకు సహకరిస్తున్నారని.. కేవలం 1 శాతం మంది ప్రజలు, యువకులు మాత్రమే అనవసరంగా బయటికి వస్తున్నారని.. అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు.. గడిచిన 16 రోజులుగా లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నామన్న సీపీ.. రోజు 9 వేల కేసులు నమోదు అవుతున్నాయి… 6 వేల వాహనాలు సీజ్ అవుతున్నాయన్నారు.. ఇక, పాతబస్తీ ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్న ఆయన.. మీ వాహనాలు సీజ్ చేసేలా పోలీసులకు అవకాశం ఇవ్వకండి అని సూచించారు.. నగరంలో 180 చెక్ పోస్ట్ ల వద్ద 24/7 నిర్విరామంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్న హైదరాబాద్ సీపీ.. కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నాం.. ఎవరైనా లాక్‌డౌన్ నిబంధనలను పాటించకపోతే చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు.
99 శాతం మంది లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారు..
Anjani Kumar