Site icon NTV Telugu

పోలీసుల కొత్త ప్లాన్.. మొబైల్ కేటుగాళ్లకు చెక్

హైదరాబాద్ నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల పెద్దమొత్తంలో పలువురి మొబైళ్లు అపహరణకు గురయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని బాధితులు తమ మొబైల్ ఫోన్లు మిస్సయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఈ ఫిర్యాదులను హాక్ ఐ యాప్‌ను ఉపయోగించి బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ల ఆచూకీని కనిపెడుతున్నారు. ఈ టెక్నాలజీతో మొబైల్ కేటుగాళ్లకు పోలీసులు చెక్ చెప్తున్నారు.

Read Also: గుడ్‌న్యూస్‌.. త్వరలో భారత్‌ నుంచి మరో రెండు వ్యాక్సిన్లు..

హాక్ ఐ టెక్నాలజీ ద్వారా కనిపెట్టిన 56 మొబైల్ ఫోన్‌లను సోమవారం నాడు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బాధితులకు అప్పగించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బాధితులకు మొబైల్ ఫోన్‌లను అందజేశారు. హాక్ ఐ యాప్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 565 మొబైల్ ఫోన్ల ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. ఇప్పటి వరకు పోలీసులు పట్టుకున్న మొబైల్ ఫోన్ల విలువ రూ.8లక్షలు ఉంటుందని సమాచారం.

Exit mobile version