NTV Telugu Site icon

TSRTC: 4 రోజులు బస్సు ప్రయాణాలు వాయిదా వేసుకోండి.. ఆర్టీసీ అధికారుల సూచన

Medaram Jatara Buses

Medaram Jatara Buses

TSRTC: హైదరాబాద్ నగరంలో బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సిటీ బస్సుల్లో ప్రయాణించే వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలసి అధికారులు సూచించారు. ఎందుకంటే మేడారం జాతర సందర్భంగా అక్కడికి బస్సులు వెళ్లే కొద్దీ నగరంలో బస్సుల సంఖ్య తగ్గుతుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో తిరిగే 2,850 సిటీ బస్సుల్లో దాదాపు 2 వేల మేడారం జాతరకు వెళ్లనున్నాయి. జాతరకు ఆర్టీసీ అధికారులు ఇప్పటికే కొన్ని బస్సులను కేటాయించారు. ఈ నెల 21 నుంచి మేడారానికి పూర్తి స్థాయిలో బస్సులు వెళ్లనున్నాయి. ఇందులో 250 బస్సులు నగరం నుంచి బయలుదేరుతాయి. మిగిలిన బస్సులు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లనున్నాయి.

Read also: Pakistan Economic Crisis: ఎన్నికల తర్వాత పాకిస్థాన్ లో పెరిగిన ధరలు.. ప్రజలు ఆందోళన..!

ఈ సందర్బంగా పనులు పెట్టుకుని ఆటోలు, క్యాబ్‌లు అవకాశంగా భావించి దోపిడీకి పాల్పడతారనే ఉద్దేశంతో హెచ్చరిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత నగరంలో మహిళా ప్రయాణికుల సంఖ్య 11 లక్షల నుంచి 18 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో మేడారం జాతరకు లక్షల మంది ప్రయాణికులు వస్తారని టీఎస్‌ఆర్టీసీ అంచనా వేసింది. అందుకే నగరంలో 2 వేల వరకు బస్సులను జాతరకు కేటాయించారు. ఆ బస్సులు పోనూ.. నగరవాసులకు 850 బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ నాలుగు రోజులు బస్సుల్లో ప్రయాణించాలనుకునే వారు, తమ పనులు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
IND vs ENG: కుటుంబానికే మొదటి ప్రాధాన్యత.. రెండో ఆలోచన ఉండదు: రోహిత్