TSRTC: 4 రోజులు బస్సు ప్రయాణాలు వాయిదా వేసుకోండి.. ఆర్టీసీ అధికారుల సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC: హైదరాబాద్ నగరంలో బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సిటీ బస్సుల్లో ప్రయాణించే వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం లేదా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలసి అధికారులు సూచించారు. ఎందుకంటే మేడారం జాతర సందర్భంగా అక్కడికి బస్సులు వెళ్లే కొద్దీ నగరంలో బస్సుల సంఖ్య తగ్గుతుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో తిరిగే 2,850 సిటీ బస్సుల్లో దాదాపు 2 వేల మేడారం జాతరకు వెళ్లనున్నాయి. జాతరకు ఆర్టీసీ అధికారులు ఇప్పటికే కొన్ని బస్సులను కేటాయించారు. ఈ నెల 21 నుంచి మేడారానికి పూర్తి స్థాయిలో బస్సులు వెళ్లనున్నాయి. ఇందులో 250 బస్సులు నగరం నుంచి బయలుదేరుతాయి. మిగిలిన బస్సులు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లనున్నాయి.
Read also: Pakistan Economic Crisis: ఎన్నికల తర్వాత పాకిస్థాన్ లో పెరిగిన ధరలు.. ప్రజలు ఆందోళన..!
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఈ సందర్బంగా పనులు పెట్టుకుని ఆటోలు, క్యాబ్‌లు అవకాశంగా భావించి దోపిడీకి పాల్పడతారనే ఉద్దేశంతో హెచ్చరిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత నగరంలో మహిళా ప్రయాణికుల సంఖ్య 11 లక్షల నుంచి 18 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో మేడారం జాతరకు లక్షల మంది ప్రయాణికులు వస్తారని టీఎస్ఆర్టీసీ అంచనా వేసింది. అందుకే నగరంలో 2 వేల వరకు బస్సులను జాతరకు కేటాయించారు. ఆ బస్సులు పోనూ.. నగరవాసులకు 850 బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ నాలుగు రోజులు బస్సుల్లో ప్రయాణించాలనుకునే వారు, తమ పనులు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
IND vs ENG: కుటుంబానికే మొదటి ప్రాధాన్యత.. రెండో ఆలోచన ఉండదు: రోహిత్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో ఎవరు బలి అవుతారు?
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!