Fire Accident : భోలక్‌పూర్‌ ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గోడౌన్‌ భారీ అగ్నిప్రమాదం

Bholak Pur

Bholak Pur

హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భోలక్‌పూర్‌లోని స్క్రాప్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. జనావాసాల మధ్య గోడౌన్‌ ఉండడంతో.. ఆందోళన నెలకొంది. మంటలు పెద్ద ఎత్తున్న ఎగిసి పడుతున్నాయి. గోడౌన్‌ చిన్న గల్లీలో ఉండడంతో మంటలు ఆర్పేందుకు ఫైర్‌ ఇంజన్‌లు వెళ్లేందుకు చోటు లేక ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఇప్పటికే ప్రమాద స్థలానికి 3 ఫైర్‌ ఇంజన్‌లను అధికారులు పంపారు. మంటలు ఎగిసిపడుతుండడంతో.. మంటలను అదుపు చేసేందుకు ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరులో కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్‌సర్య్కూట్‌తో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.. కానీ.. భారీగా అస్తినష్టం వాటిల్లింది. అయితే ఇప్పుడు భోలక్‌పూర్‌ ప్లాస్టిక్‌ గోడౌన్‌ చుట్టు జనాలు ఉండటంతో ప్రజలు ఎగసిపడుతున్న మంటలను చూసి భయాందోళనకు గురవుతున్నారు.