Hyderabad becomes Cool City: విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఇకపై కూల్ సిటీ కానుంది. ఈ భాగ్య నగరంలో ఉష్ణోగ్రతలను చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గించేందుకు బాగా ఉపయోగపడే సరికొత్త కాన్సెప్ట్ అయిన ‘విండ్ గార్డెన్’ త్వరలోనే అందుబాటులోకి రానుంది. అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్టు సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. విండ్ గార్డెన్ ప్రస్తుతం థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్‌లో ఉంది. స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌లోనూ నిర్మిస్తున్నారు.
మన దగ్గర తొలిసారిగా సంజీవయ్య పార్కులో (లేదా) మరో అనువైన అర్బన్ పార్కులో ఏర్పాటుచేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ప్రయత్నాలు మొదలుపెట్టింది. హైదరాబాద్‌లోని అర్బన్ పార్కుల నిర్వహణను హెచ్‌ఎండీఏనే చూస్తోంది. కాబట్టి విండ్ గార్డెన్ ఏర్పాటు బాధ్యతలను కూడా ఆ సంస్థకే అప్పగించారు. సిటీలో విండ్ గార్డెన్ ఏర్పాటు దిశగా తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ చొరవ చూపటం చెప్పుకోదగ్గ విషయం.
CM KCR-TRS: సీబీఐ, ఈడీ, ఐటీ చూస్తున్నాయి జాగ్రత్త. టీఆర్‌ఎస్ నేతలను అలర్ట్ చేసిన సీఎం కేసీఆర్!.
మ్యాడ్రిడ్ అధికారులు షేర్ చేసిన ట్వీట్‌పై స్పందించిన ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి, హైదరాబాద్ పట్టణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌ని ట్యాగ్ చేస్తూ ఓ సూచన చేశారు. విండ్ గార్డెన్‌ల వివరాలను సేకరించాలని, అనంతరం అలాంటి ఏర్పాట్ల కోసం హెచ్‌ఎండీఏ అర్బన్ పార్కులను పరిశీలించాలని కోరారు. మంత్రి కేటీఆర్ పోస్ట్ చేసిన ట్వీట్‌పై అర్వింద్ కుమార్ రియాక్ట్ అయ్యారు. విండ్ గార్డెన్లు ఉన్న ఆ రెండు ప్రాంతాల నుంచి డిటెయిల్స్ తెప్పించుకుంటున్నామని, హైదరాబాద్‌లోనూ విండ్ గార్డెన్‌ను నిర్మిస్తామని తెలిపారు.
గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుల్లో, ఓపెన్ ప్లేసుల్లో దీన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. విండ్ గార్డెన్ ద్వారా టెంపరేచర్లను దాదాపు 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించేందుకు మ్యాడ్రిడ్ అధికారులు కృషి చేస్తున్నారు. గార్డెన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణం చల్లబడుతుంది. తద్వారా ఆ ప్రాంతాల్లో నివసించేవారు ముఖ్యంగా ఎండా కాలంలో ఉపశమనం పొందుతారు. విండ్ గార్డెన్ మోడల్ ప్రాజెక్టు అమలుకు సంజీవయ్య పార్కే సూటబుల్ ప్లేస్ అని అంటున్నారు. హైదరాబాద్ మహా నగరం నడిబొడ్డున సువిశాలంగా పచ్చదనం పరుచుకొని ఉండటం, పక్కనే పెద్ద జలాశయం (హుస్సేస్‌సాగర్) ఉండటం అనుకూల అంశాలని చెప్పొచ్చు.
Let’s try this in Hyderabad @arvindkumar_ias
Get details and explore our HMDA urban parks for this https://t.co/Ie153QmzXi
— KTR (@KTRTRS) August 22, 2022