వైఎస్ షర్మిలకు సైదిరెడ్డి కౌంటర్.. మీ కుయుక్తులు ప్రజలు నమ్మరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ షర్మిలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి… షర్మిలమ్మ, మీ కుయుక్తులు, డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని హితవుపలికారు.. ఇవాళ వైఎస్ షర్మిల హుజూర్‌నగర్ నియోజకవర్గం పర్యటనలో నేరేడుచెర్ల మండలం మేడారం వెళ్లారని.. అక్కడ ఒక నిరుద్యోగి కనపడకుండా పోయాడని.. అందుకు శానంపూడి సైదిరెడ్డి కిడ్నాప్ చేయించాడాని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదంపై రాష్ట్రం ఏర్పడిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారన్న సైదిరెడ్డి.. మీరు ఉద్దరించేది ఇక్కడ ఏమి లేదని మండిపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానది నుండి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అనుమతి లేకుండా.. కృష్ణా బోర్డు నియమాలకు వ్యతిరేఖంగా.. 4 టీఎంసీల నీరు దౌర్జన్యంగా ఆంధ్రాకు తరలిస్తున్నారని.. దీనికి షర్మిలమ్మ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే సైదిరెడ్డి.. కాగా, ఇవాళ నేరేడుచర్ల మండలం మేడారం వెళ్లారు షర్మిల.. ఆ గ్రామానికి చెందిన నీలకంఠ సాయి అనే నిరుద్యోగి.. ఉగ్యోగాలకు నోటిఫికేషన్లు లేవన మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశాడని తెలుస్తుండగా.. షర్మిల అతనిని పరామర్శించాల్సి ఉంది.. కానీ, సదరు కుటుంబం ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయింది.. దీంతో.. ఎమ్మెల్యేపై షర్మిల అనుచరులు విమర్శలు చేసినట్టుగా తెలుస్తుండగా.. దీంతో షర్మిలపై కౌంటర్ ఎటాక్ చేశారు ఎమ్మెల్యే సైదిరెడ్డి.
Also Read
తాజావార్తలు
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
-
CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
-
China-India Air Connectivity: 6 ఏళ్ల తర్వాత మళ్లీ గ్వాంగ్జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులు.. సెప్టెంబర్ 21 నుంచి రాకపోకలు
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..