వైఎస్ షర్మిలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి… షర్మిలమ్మ, మీ కుయుక్తులు, డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని హితవుపలికారు.. ఇవాళ వైఎస్ షర్మిల హుజూర్‌నగర్ నియోజకవర్గం పర్యటనలో నేరేడుచెర్ల మండలం మేడారం వెళ్లారని.. అక్కడ ఒక నిరుద్యోగి కనపడకుండా పోయాడని.. అందుకు శానంపూడి సైదిరెడ్డి కిడ్నాప్ చేయించాడాని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదంపై రాష్ట్రం ఏర్పడిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారన్న సైదిరెడ్డి..…