Site icon NTV Telugu

హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్ధి ఖ‌రారు…

తెలంగాణ‌లోని హుజురాబాద్‌కు త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జ‌ర‌గ‌నున్న‌ది.  ఈట‌ల రాజీనామా త‌రువాత ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది.  బీజేపీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ బ‌రిలో ఉన్న సంగ‌తి తెలిసిందే.  కాగా, టీఆర్ఎస్ నుంచి ఎవ‌ర్ని నిల‌బెడుతున్నార‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు ఆస‌క్తిక‌రంగా ఉంది.  హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్ధిని పార్టీ ఖ‌రారు చేసిన‌ట్టు వార్త‌లు వస్తున్నాయి.  గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌ను హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్ధిగా ఎన్నుకున్న‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి.  కాసేప‌ట్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.  ప్ర‌స్తుతం గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ టీఆర్ఎస్‌వీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.  టీఆర్ఎస్ అభ్య‌ర్ధి ఖ‌రార‌వ్వ‌డంతో నేత‌లు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం ప్రారంభించే అవ‌కాశం ఉన్న‌ది.

Read: ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

Exit mobile version